చాలా మందికి అత్యంత ఇష్టమైన పానియం కాఫీ. కొంతమందికైతే కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభంకాదు. ఐతే కాఫీ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని కొన్ని పరిశోధనలు వెల్లడించినప్పటికీ.. దీనిని అధికంగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో అనేక మంది దీనికి అడిక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. కాఫీ తాగడం మానెయ్యడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు. వాటిల్లో కొన్ని మీకోసం..
ఎనర్జీ మరింత పెరిగినట్లు అనిపిస్తుంది
కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఎనర్జీ బూస్టర్ అని మీరు ఇంతకాలం భావించి ఉండవచ్చు. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శక్తి హీణత లేదా అలసటకు కారణమవుతుందని మీకు తెలుసా! కాఫీ తీసుకోవడం ఎప్పుడైతే మానేస్తారో.. శరీరానికి నిజంగా శక్తినిచ్చే పోషకాలను గుర్తించగలుగుతారు. అలాగే నిద్ర, స్ట్రెస్ హైడ్రేషన్, పోషకాహారం, యోగాలపై మరింత దృష్టి నిలపగలుగుతారు కూడా. కాబట్టి కాఫీతాగడం మానేస్తే.. రోజుమొత్తానికి అవసరమైన కాఫీకంటే మెరుగైన శక్తిని పొందుకుంటారనడంలో సందేహం లేదు.
మంచి నిద్ర వస్తుంది
రాత్రిపూట కప్పు కాఫీ తాగడం వల్ల దానిలోని కెఫెన్ మీకు సరిపడినంతగా నిద్రపట్టకుండా చేసి, నిద్రలేమికి కారణమవుతుంది. ఐతే కాఫీ మానేస్తే కెఫెన్ కంటెంట్ లేకపోవడం వల్ల మీరు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.
బరువులో మార్పులు లేకపోవడం
కాఫీ తాగే అలవాటును మానుకోవడం వల్ల మీ బరువులో ఎటువంటి తేడా కనిపించదని నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు తగ్గడం లేక పెరగడం వంటివి సంభవిస్తాయేమోనని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహమాత్రమే. కాబట్టి మీరు రిలాక్స్‌డ్‌గా ఉండొచ్చు. పైగా మీ శరీరంలో కేలరీల స్థాయిలు తగ్గి, కొన్ని కిలోల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
యాంగ్జైటీ స్థాయిలు తక్కువ
కాఫీ తాగిన వెంటనే మీలో యాంగ్జైటీ పెరుగుతుంది. కెఫిన్ కంటెంట్ దీనికి ప్రధాన కారణం. కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తే, కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె కండరాల పనితీరును ఉత్తేజపరుస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి కాఫీ తాగే అలవాటు మానుకుంటే ఆందోళన మీ చెంతకు చేరదు.
తలనొప్పి, చికాకు నుంచి విముక్తి
తలనొప్పి, చిరాకు, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలు మీలొ ఎప్పుడైనా కనిపించాయా? సాధారణంగా కాఫీ తాగేవారు తలనొప్పి, అలసటను అనుభవిస్తారు. కానీ కాఫీ అలవాటును మానేసిన కొన్ని రోజుల్లోనే ఈ లక్షణాల నుంచి బయటపడగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..!
Comments
Please login to add a commentAdd a comment