caffeine
-
కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్‌పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్లో పవర్‌హౌస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్‌కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
పబ్లిక్ ఇష్యూల హవా
న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంది. బుధవారం(14న) ముగిసిన శూల వైన్యార్డ్స్కు 2.33 రెట్లు అధిక స్పందన లభించగా.. గురువారం(15న) ముగిసిన మరో రెండు ఐపీవోలు విజయవంతమయ్యాయి. ఇవి ల్యాండ్మా ర్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్‌కాగా.. సోమ (21), మంగళ(22)వారాల్లో మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ ప్రభావంతో హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండెజీన్ లిమిటెడ్ తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇతర వివరాలు చూద్దాం.. ల్యాండ్‌మార్క్ కార్స్ చివరి రోజుకల్లా ప్రీమియం ఆటోమొబైల్ డీలర్ షిప్ కంపెనీ ల్యాండ్‌మార్క్ కార్స్ ఐపీవోకు 3 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 80,41, 805 షేర్లు ఆఫర్ చేయగా.. 2.46 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 8.71 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.32 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 59 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 481–506 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 552 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. అబాన్స్ హోల్డింగ్స్ ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ అబాన్స్ హోల్డింగ్స్ ఐపీవోకు చివరి రోజుకల్లా కేవలం 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 1,28,00,000 షేర్లు ఆఫర్ చేయగా.. 1.40 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 4.1 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.48 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 40 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 256–270కాగా.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ అబాన్స్ ఫైనాన్స్ పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలిన్ ధర ఖరారు ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 234–247 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 20–22 మధ్య చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తొలుత రూ. 760 కోట్లపై కన్నేసినప్పటికీ టార్గెట్‌లో కోత పెట్టుకుంది. వెరసి ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, యూపీ, గోవా యూనిట్ల విస్తరణ, ఆధునీకరణసహా ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్, తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఫ్రాక్షనల్ హెచ్‌పీ మోటార్స్ తయారీలో పేరొందింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) ఆదాయం 27 శాతం జంప్‌చేసి రూ. 1,094 కోట్లకు చేరగా.. నికర లాభం 12 శాతం మెరుగుపడి రూ. 39 కోట్లను తాకింది. ఇండెజీన్ లిమిటెడ్ హెల్త్‌కేర్ టెక్ కంపెనీ ఇండెజీన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమపై దృష్టి పెట్టిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 3,200 కోట్లు సమీకరించాలని చూస్తోంది. దీనిలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 3.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సోమవారం కేఫిన్.. 19న ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
వచ్చే వారం 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 347–366 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో 20న మొదలై 22న ముగియనుంది. వివరాలు చూద్దాం.. రూ. 1,500 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 16న షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. రూ. 475 కోట్లకు పరిమితం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో ద్వారా రూ. 475 కోట్లు మాత్రమే సమీకరించనుంది. మొదట్లో రూ. 760 కోట్లను సమకూర్చుకోవాలని భావించినప్పటికీ తదుపరి టార్గెట్‌లో కోత పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. తద్వారా ఘజియాబాద్(యూపీ), వెర్నా(గోవా)లోని ప్లాంట్ల విస్తరణను చేపట్టనుంది. లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్ తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
కళామందిర్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్‌లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!!
4 Daily Habits People With Depression May Avoid: ప్రస్తుత జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ డిప్రెషన్‌కు గురౌతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు భిన్న కొత్త అలవాట్లకు బానిసవుతున్నారు. ఫలితంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది పరిస్థితి. ముఖ్యంగా ఆ టైంలో ఈ నాలుగింటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. కొంతమంది అధిక ఒత్తిడిని తట్టుకోవడానికి వైన్, బీర్, రైస్ వైన్ లాంటి ఆల్కహాల్‌కు అడిక్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత జఠిలమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలోని కారకాలు ఒత్తిడిని మరింత పెంచుతాయట. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. డిప్రెషన్‌కు గురైనవారు సిగరేట్స్ కూడా అధికంగా కాల్చుతారు. ఈ సమయంలో ధూమపానం మాత్రమేకాదు, పొగాకు తాలూకు వేటిని కూడా తీసుకోకపోవడం మంచిది, మరికొంత మంది ఒత్తిడిలో అధికంగా ఫుడ్ తినేస్తుంటారు. అందులో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్.. వంటివి కూడా ఆరోగ్యానికి మరింత హాని కలుగజేస్తాయి. కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. సాధారణంగా కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఇతర సప్లిమెంట్లలో కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని సేవిస్తే రాత్రుల్లు నిద్రపట్టక డిప్రెషన్ తాలూకు ఆలోచనలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరేం చెయ్యాలి.. ప్రతి ఉదయం 5 గంటలకు నిద్రలేచి ధ్యానం చేయడం, చిన్న పాటి యోగాసనాలు వేయటం, బుక్స్ చదవడం, చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపటం, డ్రాయింగ్, పెయింటింగ్ లేదా కొత్ర ప్రదేశాలకు వెళ్లటం.. వంటి పనుల ద్వారా మనసును వేరే వాటిపైకి మళ్లించి జీవితాన్ని మరింత ఆనందంగా గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
గుడ్‌న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే..
Consumption of coffee Daily can prevent development of Alzheimer's disease: ప్రతి ఉదయం వేడివేడిగా కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అటువంటి కాఫీ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్! కాఫీ తాగనివారితో పోల్చితే తాగేవారికి మతిమరుపు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై 10 యేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీతాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మెదడులోని అల్జీమర్స్ అభివృద్ధలో కీలకంగా వ్యవహరించే అమిలాయిడ్ ప్రొటీన్‌ను నిరోధించడంలో కాఫీలోని కారకాలు ఉపయోగపడతాయని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి కాఫీ తాగడం సులువైన మార్గమని పేర్కొన్నారు. మతిమరుపుతో బాధపడే వ్యక్తులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పవచ్చు. చదవండి: కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం.. మధ్య వయస్సు వ్యక్తుల జీవనశైలిలో కాఫీని తప్పకుండా చేర్చుకోవాలి. రోజుకు 240 గ్రాముల చొప్పున ఒక కప్పు కాఫీ తాగేవారైతే, అదనంగా మరో కప్పును చేర్చడం మంచిది. ఫలితంగా 18 నెలల తర్వాత 8% వరకు మతిమరుపు సమస్య నివారణ ఔతుందని, అదేవిధంగా మెదడులో అమిలాయిడ్ ప్రొటీన్ ఏర్పడటం 5% తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడులో అమిలాయిడ్ బలమైన ఫలకాలు ఏర్పడేలా చేసి అల్జీమర్స్ వ్యాధిదారి తీస్తుంది. మెదడు ఆరోగ్యంపై కాఫీలో ఏ కారకాలు సానుకూలంగా పనిచేస్తున్నాయనే అంశంపై ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి ఇది ఏకైక కారణమని దీనిపై మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందని పరిశోధకులు తెలిపారు. చదవండి: అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!! -
Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు..
చాలా మందికి అత్యంత ఇష్టమైన పానియం కాఫీ. కొంతమందికైతే కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభంకాదు. ఐతే కాఫీ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని కొన్ని పరిశోధనలు వెల్లడించినప్పటికీ.. దీనిని అధికంగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో అనేక మంది దీనికి అడిక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. కాఫీ తాగడం మానెయ్యడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు. వాటిల్లో కొన్ని మీకోసం.. ఎనర్జీ మరింత పెరిగినట్లు అనిపిస్తుంది కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఎనర్జీ బూస్టర్ అని మీరు ఇంతకాలం భావించి ఉండవచ్చు. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శక్తి హీణత లేదా అలసటకు కారణమవుతుందని మీకు తెలుసా! కాఫీ తీసుకోవడం ఎప్పుడైతే మానేస్తారో.. శరీరానికి నిజంగా శక్తినిచ్చే పోషకాలను గుర్తించగలుగుతారు. అలాగే నిద్ర, స్ట్రెస్ హైడ్రేషన్, పోషకాహారం, యోగాలపై మరింత దృష్టి నిలపగలుగుతారు కూడా. కాబట్టి కాఫీతాగడం మానేస్తే.. రోజుమొత్తానికి అవసరమైన కాఫీకంటే మెరుగైన శక్తిని పొందుకుంటారనడంలో సందేహం లేదు. మంచి నిద్ర వస్తుంది రాత్రిపూట కప్పు కాఫీ తాగడం వల్ల దానిలోని కెఫెన్ మీకు సరిపడినంతగా నిద్రపట్టకుండా చేసి, నిద్రలేమికి కారణమవుతుంది. ఐతే కాఫీ మానేస్తే కెఫెన్ కంటెంట్ లేకపోవడం వల్ల మీరు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. బరువులో మార్పులు లేకపోవడం కాఫీ తాగే అలవాటును మానుకోవడం వల్ల మీ బరువులో ఎటువంటి తేడా కనిపించదని నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు తగ్గడం లేక పెరగడం వంటివి సంభవిస్తాయేమోనని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహమాత్రమే. కాబట్టి మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు. పైగా మీ శరీరంలో కేలరీల స్థాయిలు తగ్గి, కొన్ని కిలోల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంగ్జైటీ స్థాయిలు తక్కువ కాఫీ తాగిన వెంటనే మీలో యాంగ్జైటీ పెరుగుతుంది. కెఫిన్ కంటెంట్ దీనికి ప్రధాన కారణం. కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తే, కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె కండరాల పనితీరును ఉత్తేజపరుస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి కాఫీ తాగే అలవాటు మానుకుంటే ఆందోళన మీ చెంతకు చేరదు. తలనొప్పి, చికాకు నుంచి విముక్తి తలనొప్పి, చిరాకు, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలు మీలొ ఎప్పుడైనా కనిపించాయా? సాధారణంగా కాఫీ తాగేవారు తలనొప్పి, అలసటను అనుభవిస్తారు. కానీ కాఫీ అలవాటును మానేసిన కొన్ని రోజుల్లోనే ఈ లక్షణాల నుంచి బయటపడగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! -
కాఫీ డే: రోజుకి ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?
International Coffee Day 2021: మంచి నీటితో పోటీపడుతూ.. మనిషి జీవనంలో టీ, కాఫీలు ఒక భాగంగా మారిపోయాయి. అందుకే వీటి కోసమూ ప్రత్యేకంగా రోజులను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1న(ఇవాళ) అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి.. అదే విధంగా అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ఈరోజు ప్రత్యేకత. అలాగే కాఫీ వర్తకం గురించి చర్చిస్తూనే.. పనిలో పనిగా ‘కాఫీ’ని జీవనోపాధిగా చేసుకునే వాళ్లకు మద్దతు ప్రకటించే రోజు కూడా. ఇంతకీ రోజూ ఎన్ని కప్పుల కాఫీ తాగొచ్చు.. ఏం ఏం ప్రయోజనాలు ఉంటాయి. అతి వల్ల నష్టమేంటో చూద్దాం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే బాడీలో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. అయితే ఇది మనుషులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీ (హైపర్‌టెన్షన్), ఒంట్లో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం (హైపర్‌లిపిడేమియా) ఉన్నాయనుకుందాం. సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావానికీ, ఆ జబ్బులున్నవాళ్లలో చూపే ప్రభావానికీ తేడాలుంటాయి. అలాగే కాఫీ ఏరకానికి చెందింది, ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అది ఫిల్టర్ కాఫీనా? సాధారణ కాఫీనా? అనే అంశం లాంటివన్నమాట. 2015 నుంచి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కాఫీ డే నిర్వహిస్తూ వస్తోంది. కొన్నిదేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ.. ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్ 1నే జరుపుతున్నాయి. ఈ కారణం వల్లే అక్టోబర్ 1ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా పాటిస్తున్నారు. కాఫీ సుగుణాలివే... © కాఫీలో బోలెడన్ని మంచి గుణాలున్నాయి. © కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. © కాఫీలోని డైఫినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. © కాఫీ బాడీని ఉత్తేజితంగా ఉంచుతుంది. © అయితే ఈ బెనిఫిట్స్ కోసం కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి. చదవండి: గర్భిణులకు కాఫీ సేఫేనా? కెఫిన్‌తో హెల్త్.. కాఫీలో ఉండే కెఫిన్ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే... దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్‌జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. © కాఫీలో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. లేకుంటే అవసరం లేని మాత్ర వేసుకుంటే కలిగిన సైడ్ ఎఫెక్ట్ కలిగినట్లే. © కాఫీ.. యాంగ్జైటీ మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది. © రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. కాఫీ.. మూడు కప్పులు మహాఅయితే నాలుగు కప్పులు మించకుండా తాగితేనే దేహానికీ, ఆరోగ్యానికీ మేలని గుర్తుంచుకోండి. ఎలా తాగితే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయో తెలుసుకుని, అలా మాత్రమే వాటిని తాగండి. ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ కాఫీ డే టు కాఫీ లవర్స్. -
ఎనర్జీ డ్రింక్స్.. ఎంతవరకు సేఫ్
తక్షణ శక్తి, చురుకుదనం, ఏకాగ్రత పెంచే పానీయాలుగా ఎనర్జీ డ్రింక్‌కు పేరు. వీటిని ఎక్కువగా క్రీడాకారులు తాగుతుంటారు. ఇప్పుడిప్పుడే మిగిలిన వారూ వీటిని అలవాటు చేసుకుంటున్నారు. అయితే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్లు ఏదైనా మితం అయితేనే ఉపయోగకరం. అతిగా తీసుకుంటే అనవసర చిక్కుల్లో పడక తప్పదు. ఎనర్జీ డ్రింక్స్‌కు సైతం ఈ సూత్రం వర్తిస్తుంది. కానీ, కొందరు అదే పనిగా ఎనర్జీ డ్రింక్స్ తాగడానికి అలవాటు పడి ఉంటారు. ఇలా వ్యసనంగా మార్చుకోవడం వల్ల కలిగే నష్టాలు, బయటపడే మార్గాల గురించి తెలుసుకుందామిలా... ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫెన్, చక్కెర, బి–విటమిన్లు, ఎల్–టారిన్ లాంటి అమైనో ఆమ్లాల ఉత్పన్నాలు, ఆయుర్వేద మూలికా గుణాలు ఉంటాయి. అందువల్లే ఎనర్జీ డ్రింక్స్ శారీరక, మానసిక ఉత్ప్రేరక పానీయాలుగా పనిచేస్తాయి. అయితే, ఈ లాభాలతోపాటు ఇందులోని కెఫెన్, చక్కెర కలిగించే దుష్ప్రభావాలూ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి ఈ డ్రింక్స్‌ను తాగడాన్ని వ్యసనంగా మార్చుకోవడం, సహజశక్తిని నమ్ముకోకుండా వీటిపైనే ఆధారపడడం. వ్యసనం–లక్షణాలు ఏదైనా ఒక అలవాటు మనకు హాని చేస్తుందని తెలిసినా మానలేకపోవడమే వ్యసనం. ఇదొక మానసిక స్థితి. అతిగా తినడం, తాగడం, కంప్యూటర్ గేమ్స్‌కు అలవాటు పడడం.. తదితరం అన్నీ ఇలాంటివే. ఎనర్జీ డ్రింక్స్ వ్యసనం కూడా ఇలాంటిదే. మాదకద్రవ్యాల వ్యసనంలా ఇదంత హానికరం కాకపోయినప్పటికీ ఇది కూడా ప్రమాదకరమే. ఇలా ఎనర్జీ డ్రింక్స్ వ్యసనంగా మారడానికి అందులోని కెఫెన్, ఆర్ట్టఫియల్ స్వీట్నర్స్దే ప్రధాన పాత్ర. ఈ వ్యసన లక్షణాలు ఇలా ఉంటాయి. ∙ఎనర్జీ డ్రింక్స్‌ను తాగాలనే బలమైన కోరికలు ∙మనసులో ఎనర్జీ డ్రింక్స్ గురించే ఆలోచనలు ∙ఎనర్జీ డ్రింక్స్‌ను పరిమితి లోపు మాత్రమే తీసుకోవడంలో అదుపు కోల్పోవడం. ∙ఈ డ్రింక్స్‌కు తాగకుండా ఉన్నప్పడు తలనొప్పి, చిరాకు, అలసట వచ్చినట్లు అనిపించడం. దుష్ప్రభావాలు ఎనర్జీ డ్రింక్స్‌లో ఆమ్ల స్వభావం ఎక్కువ. అందువల్ల వీటిని ఎక్కువగా తాగినప్పుడు చిగుళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా దంత సమస్యలు వస్తాయి. అలాగే తరచూ వీటిని తాగడం వల్ల బరువు పెరిగే ప్రమాదమూ ఉంది. ఇది ప్రయోగాత్మక అధ్యయనంలోనూ నిజమని తేలింది. అలాగే షుగర్ శాతం అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ తరచూ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలైన హృద్రోగాలు, టైప్ 2 డయాబెటిస్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ షుగర్ లేని ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా అందులోని కెఫెన్, ఆర్టిఫియల్ స్వీటర్న్ సైతం టైప్ 2 డయాబెటిస్, జీర్ణక్రియ సమస్యలు సృష్టిస్తాయని అంటున్నారు. ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే రోజూ కనీసం ఒకటి రెండు ఎనర్జీ డ్రింక్స్ కొనడం ఆర్థిక పరిస్థితినీ ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అయితే, ఎనర్జీ డ్రింక్స్ వ్యసనం నుంచి బయటపడడం కూడా అంత సులభం కాదు. ఒక క్రమపద్ధతిలో దీని నుంచి దూరం కావడానికి ప్రయత్నం చేయాలి. హఠాత్తుగా మానేయాలని ప్రయత్నిస్తే కొన్ని రకాల చెడు ప్రభావాలు సైతం కనిపించే ప్రమాదం ఉంది. అందువల్ల డాక్టరును సంప్రదించి ఆ తర్వాత ఒక క్రమపద్ధతిలో ఈ వ్యసనం బారి నుంచి బయటపడడానికి ప్రయత్నించవచ్చు. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు కాఫీ, లేదా డికాఫ్, పండ్ల రసాలు, గ్రీన్ టీ, ఆయుర్వేద టీలు తీసుకోవడం ద్వారానూ ఫలితం పొందవచ్చు. -
ఎనర్జీ డ్రింక్స్‌తో 90 నిమిషాల్లోనే..
లండన్ : ఒక ఎనర్జీ డ్రింక్‌తో కేవలం 90 నిమిషాల్లోనే గుండె పోటు, స్ర్టోక్ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఎనర్జీ డ్రింక్‌లు రక్త నాళాలను పెళుసుబారేలా చేయడంతో కీలక అవయవాలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయని హోస్టన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు పేర్కొన్నారు. గతంలో రెడ్ బుల్, మాన్స్టర్ వంటి ఎనర్జీ డ్రింక్‌లకు కడుపు, నరాలు, గుండె సమస్యలకు మధ్య సంబంధాన్ని పలు అథ్యయనాలు పేర్కొన్నా వీటిని అతిగా సేవించడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని వెల్లడించాయి. అయితే ఎనర్జీ డ్రింక్ తీసుకున్న 90 నిమిషాల్లోనే రక్తనాళాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తాజా అథ్యయనం పేర్కొంది. ఎనర్జీ డ్రింక్‌ల్లో కలిపే కేఫిన్, టారిన్, చక్కెర ఇతర హెర్చల్స్ రక్తనాళాలపై ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు అంచనా వేశారు. ఎనర్జీ డ్రింక్‌ల్లో చక్కెర శాతం అధికంగా ఉండటం గమనార్హం. కెఫిన్ సైతం రక్త నాళాలు కుచించకుపోయేలా చేస్తుందని, తాత్కాలికంగా బీపీని పెంచే అడ్రినలైన్ హోర్మోన్‌ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్‌ల వాడకం పెరుగుతున్నందున వీటి అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మెక్ గవర్న్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ హిగ్గిన్స్ సూచించారు. -
కెఫీన్‌తో గుండెకు రక్షణ
రోజూ కాఫీ తాగితే కొన్ని రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని ఇప్పటికే చాలా పరిశోధనలు స్పష్టం చేశాయి. అయితే ఇదెలా జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియలేదు. ఈ లోటును భర్తీ చేశారు జర్మనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కాఫీలో ఉండే కెఫీన్ ప్రభావంతో మన కణాల్లోని మైటోకాండ్రియాలో ఉండే ఒక ప్రొటీన్ చురుకుగా కదులుతుందని వీరు గుర్తించారు. ఈ ప్రొటీన్ గుండె కణాలకు జరిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు నివారిస్తుందని.. ఫలితంగా కాఫీ తాగితే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయని వీరు వివరిస్తున్నారు. మామూలు పరిస్థితుల్లో రక్తనాళాల తాలూకూ ఎండోథీలియల్ కణాల్లో ఉండే పీ27 కెఫీన్ అందినప్పుడు మైటోకాండ్రియలోకి చేరి ఫైబ్రోబ్లాస్ట్‌ల నుంచి కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని.. ఈ కణాల్లో కాంట్రాక్టైల్ ఫైబర్స్ ఉండటం వల్ల గుండెపోటు కారణంగా దెబ్బతిన్న కండరాలను మరమ్మతు చేయడం వీలవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాచిమ్ ఆల్స్షామిడ్ వివరించారు. ఈ స్థాయి చర్యలు జరగాలంటే నాలుగు కప్పుల కాఫీలో ఉండేంత కెఫీన్ శరీరంలోకి చేరాల్సి ఉంటుందని అంటున్నారు. కెఫీన్ గుండెజబ్బులతోపాటు మధుమేహం అంచుల్లో ఉన్నవారు, ఊబకాయులకూ మంచిదని ఎలుకలపై జరిగిన ప్రయోగాలు ఇప్పటికే రుజువు చేసిన విషయం తెలిసిందే. -
ఈ అలవాటుతో ప్రమాదమా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నాకు టీ, కాఫీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంది. ఈ సమయంలో వాటిని పూర్తిగా మానేయాలని కొందరు, అది పట్టించుకోవలసిన విషయం కాదని మరికొందరు అంటు న్నారు. టీ, కాఫీల ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఈ అలవాటును మానేయాలనుకుంటే... ఏ నెలలో పూర్తిగా మానేస్తే మంచిది? – డి.మానస, అనకాపల్లి కాఫీ, టీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ కెఫిన్ చాకొలెట్, కూల్‌డ్రింక్స్‌లలో కూడా ఉంటుంది. వీలైనంత వరకు గర్భిణులు వీటిని తీసుకోకపోవడమే మంచిది. మరీ బాగా అలవాటైపోయి మానెయ్యలేకపోతే ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. కెఫిన్ రోజుకు 200ఎమ్జీ కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణులలో అబార్షన్లు, శిశువు బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తల్లికి కూడా కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. వీటివల్ల ఆహారంలోని ఐరన్ ఖనిజం రక్తంలోకి ఎక్కువగా చేరదు. కాబట్టి ఇవి తాగకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితిలో అయితే రోజుకి రెండుసార్లు చిన్న కప్పుల్లో కొద్దిగా తీసుకోవచ్చు. ఎప్పటి నుంచి మానేస్తే మంచిదని అడిగారు కదా. గర్భం దాల్చినప్పటి నుంచే మానెయ్యడం మంచిది. ఎలాంటి లక్షణాల ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని గుర్తు పట్టవచ్చు? నేను మార్నింగ్ సిక్నెస్కు గురవుతున్నాను. ఇది ప్రెగ్నెన్సీ లక్షణం అని ఒక స్నేహితురాలు అంటోంది. ఇది ఎంత వరకు నిజం? – ఆర్.కీర్తి, నగరి గర్భం వచ్చిందని గుర్తు పట్టడానికి ఒక్కొక్కరి శరీరవాటాన్ని బట్టి, వారిలో విడుదలయ్యే హార్మోన్స్ మోతాదును బట్టి ఉంటాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా సాధారణంగా ఉంటారు. కళ్లు తిరగడం, వికారం, వాంతులు, నీరసం, రొమ్ములలో నొప్పి, ఛాతీ, గొంతులో మండినట్లు ఉండటం, కొద్దిగా నడుము నొప్పి, పొత్తి కడుపులో బరువుగా ఉండటం, యోని నుంచి నీరులాగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉండొచ్చు. ఈ సమయంలో బీటా హెచ్‌సీజీ, ప్రొజెస్టరాన్ హార్మోన్ల విడుదల వల్ల ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఇవి విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. కానీ కేవలం పైన చెప్పిన లక్షణాలను బట్టే ప్రెగ్నెన్సీ వచ్చిందని నూటికి నూరు శాతం చెప్పడం జరగదు. కానీ ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పొచ్చు. పీరియడ్ రాకపోతే మూత్రంతో బీటా హెచ్‌సీజీ పరీక్ష ద్వారా, అలాగే కొందరిలో బ్లడ్తో బీటీ హెచ్‌సీజీ పరీక్ష ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కొందరిలో నెల తప్పకుండా కూడా కొద్దిగా బ్లీడింగై గర్భం నిలిచే అవకాశం ఉంటుంది. దీన్ని మూత్రంతో బీటా హెచ్‌సీజీ పరీక్ష ద్వారా, అంటే ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎపిలెప్సీ ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీకి వెళ్లడం రిస్క్ అవుతుందా? ఒకవేళ తప్పనిసరి అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయగలరు. – కె.మాలిని, హన్మకొండ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ వ్యాధి ఉండటం. ఈ ఎపిలెప్సీ ఉన్నవాళ్లు గర్భం దాల్చినప్పుడు, వారిలో మామూలు గర్భిణులతో పోలిస్తే కొన్ని సమస్యలు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ కోసం వాడే మందుల వల్ల కొంతమంది శిశువుల్లో అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మందులు వాడకపోతే, తల్లిలో ఫిట్స్ రావడం వల్ల, శిశువుకి ఆక్సిజన్ సరఫరా తగ్గడం, బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం, బిడ్డ మెదడు, దాని పనితీరులో లోపాలు, అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు వంటి అనేక సమస్చలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎపిలెప్సీ ఉన్నవాళ్లు గర్భం రాకముందే డాక్టర్ని సంప్రదించి, అవే ఎపిలెప్సీ మందులను వాడాలా లేక మార్చివాడాలా. మోతాదు మార్చాలా అనే అంశాలను గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. అలాగే మీరు ఫోలిక్‌యాసిడ్ మందులను ముందు నుంచే వాడటం కూడా మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎపిలెప్సీ మందులను క్రమం తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో సరైన మోతాదులో తీసుకోవాలి. కెఫిన్ రోజుకు 200ఎమ్జీ కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణులలో అబార్షన్లు, శిశువు బరువు తక్కువగా పుట్టడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. -
మార్కెట్లో విషతుల్య ఆహారోత్పత్తులెన్నో?
సాక్షి, న్యూఢిల్లీ : పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న 'రెస్ట్‌లెస్ జిన్సెంగ్' అనే ఎనర్జీ డ్రింక్‌లో ప్రమాదకరమైన 'కఫేన్, జిన్సెంగ్' మిశ్రమం ఉందని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రమాదకరమైన మిశ్రమం కారణంగా ఈ ఎనర్జీ డ్రింక్ తాగినవారికి ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదుగానీ గుండెపోటు, రక్తపోటు రావడం ఖాయమని వారు తేల్చిచెప్పారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకే ఆహార భద్రతా సంస్థ తరఫున శాస్త్రవేత్తలు స్పందించారనడం ఇక్కడ గమనార్హం. ఈ ఉత్పత్తిని అమ్ముతున్న కంపెనీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2015, జూన్‌లో 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' జారీ చేసింది. ఆహార భద్రతా అధికారులతోపాటు వినియోగదారుల సంఘాలు గోల చేయడంతో విష రసాయనం వెలుగులోకి వచ్చిన ఏడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్పత్తికి ఎన్ఓసీని రద్దు చేసింది. ఈలోగా మార్కెట్లోకి విడుదల చేసిన ఎనర్జీ డ్రింక్ స్టాక్‌నంతా పుష్పమ్ ఫుడ్స్ కంపెనీ అమ్ముకోగలిగింది. ఈ ఏడు నెలలపాటు ఆ ఎనర్జీ డ్రింక్‌ను తాగిన వినియోగదారుడు అనారోగ్యానికి గురవుతూనే ఉన్నాడన్న మాట. అవసరమైన ముందస్తు తనిఖీలు లేకుండా 'మా ఉత్పత్తులు సురక్షితం' అంటూ కేవలం కంపెనీలు ఇచ్చే భరోసాపైనా మార్కెట్లోకి విడుదలైన ఇలాంటి ఆహార ఉత్పత్తులు దాదాపు 800 రకాలు ఉన్నాయి. వాటన్నింటినిపై పరిశోధనలు జరిపితే ఎన్ని జబ్బులకు దారితీస్తున్న విష మిశ్రమాలున్నాయో! 'జిన్సెంగ్' ఉత్పత్తిని నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడు నెలలు పట్టడానికి కారణం అందులో ప్రత్యక్ష పాపం తనది కూడా కావడం. ఆహార పరిశ్రమ నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకోలేకనో లేదా చేతులు తడుపుకోవాలనే తహతహో తెలియదుగానీ ఆహార భద్రత ప్రమాణాలను భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ 2012 నుంచి సడలిస్తూ వస్తోంది. ఇక కేంద్రంలోని ఆహార శాఖా కార్యాలయంలోని డాక్యుమెంట్ల ప్రకారం 2014, ఆగస్టు నెలలో కేంద్రంలోని ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా జోక్యం చేసుకొని సడలింపు పేరిట నిబంధనలను నీరుగార్చింది. ఆహార భద్రతా సంస్థ అధికారులతోపాటు, కేంద్ర ఆహార శుద్ధి శాఖ, పారిశ్రామిక వర్గాలతో ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి సమావేశమై కొత్త ప్రమాణాలను నిర్దేశించారు. వీటిని అప్పటి ఆహార భద్రతా సంస్థ సీఈవో వైఎస్ మాలిక్ తీవ్రంగా వ్యతిరేకించారు. అదే ఏడాది మే నెలలో ఈ ప్రమాణాలు ప్రమాదరమైనవంటూ నచ్చ చెప్పేందుకు పారిశ్రామికవేత్తలకు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. 'మా ఆహారోత్పత్తులు సురక్షితం' అంటూ కంపెనీలే భరోసా ఇస్తున్నప్పుడు మనకెందుకు అభ్యంతరమంటూ మాలిక్‌కు నచ్చచెప్పేందుకు ప్రధాని ప్రధాన కార్యదర్శి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో మాలిక్‌ను ఆహార భద్రతా సంస్థ నుంచి బదిలీ చేశారు. ఇంతకు ఆయన వ్యతిరేకించిన అంశాలేమిటీ? శుద్ధి చేసిన ఆహార పదార్థాలలో సాధారణంగా మూడు రకాల పదార్థాలు లేదా మిశ్రమాలు ఉంటాయి. ఒకటి ప్రొప్రైటరీ ఫుడ్స్, రెండు నావెల్ ఫుడ్స్, మూడు యాడింగ్స్. ప్రొప్రైటరీ ఫుడ్స్ అంటే, మనం తినే రకరకాలు దినుసులు. కెఫిన్, జిన్సెంగ్ కూడా ఈ రకం పదార్థాలే. విడివిడిగా ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ వీటి మిశ్రమం వల్ల ప్రమాదరకమైన రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇక రెండోది నావెల్ ఫుడ్స్. కొత్త రుచుల ఆహారం లేదా ఆహార మిశ్రమం. ఇక యాడింగ్స్ అంటే ఆ ఆహార పదార్థాలను ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మిశ్రమాలు, రసాయనాలు. నావెల్ ఫుడ్స్..కంపెనీ యాజమాన్యం ఇష్ట ప్రకారం ఉంటాయి. ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ మాత్రం ఆహార భద్రతా సంస్థ శాస్త్రవేత్తలు సూచించిన ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. ఏయే పదార్థాలు, ఏయే మిశ్రమాలు ఏ స్థాయిలో ఉండాలో ఆహార సంస్థ భద్రతా ప్రమాణాలు సూచిస్తాయి. పారిశ్రామిక వర్గాల ఒత్తిడి ప్రొప్రైటరీ ఫుడ్స్, యాడింగ్స్ వల్ల అనవసరంగా తమకు కాలయాపన అవుతోందని, వీటిని సడలించాలని ఎప్పటి నుంచో పారిశ్రామిక వర్గాలు కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఆ ఒత్తిళ్లకు లొంగి 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రమాణాలను కొంత సడలించగా, 2014లో అధికారంలోకి వచ్చిన బీజీపీ ప్రభుత్వం మరింతగా సడలించింది. అయితే పలు అవాంతరాలు, కోర్టు కేసుల కారణంగా సడలించిన నిబంధనలు 2016, జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆహార భద్రతకు సంబంధించి పీఎంవో ఆధ్వర్యంలో కేంద్ర ఆహార శాఖ తీసుకున్న నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం లేదన్న కారణంగా ముంబై హైకోర్టు కొట్టి వేయడం, దానిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇంత జాప్యం జరిగిందన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా భద్రతా ప్రమాణాలను నోటిఫై చేయకుండానే అమల్లోకి తెచ్చింది. సడలించిన ప్రమాణాలేమిటీ? సడలించిన ప్రమాణాల ప్రకారం ప్రొప్రైటరీ ఫుడ్స్ విషయంలో ఆహార సంస్థ ఆమోదించిన పదార్థాలు లేదా దినుసులు ఉపయోగించాలి. అయితే వాటిని వేటివేటితో కలుపుతారో, ఏ మోతాదులో కలుపుతారో ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ నిబంధన ఉండేది. ఇక్కడ కెఫేన్, జిన్సెంగ్ భారత ఆహార సంస్థ ఆమోదించినవే. అయితే వాటి మిశ్రమానికి ఆహార సంస్థ ఆమోదం లేదు. ఈ రెండింటిని కలపడం వల్ల జిన్సెంగ్ ప్రమాదకర డ్రింక్‌గా మారింది. అలాగే ఎక్కువ కాలం ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పదార్థాలు కూడా ఆహార సంస్థ ఆమోదించినవే ఉండాలి. అయితే అది ఏ మోతాదులో ఉండాలో యాజమాన్యం ఇష్టం. ఇంతకుముందు ప్రమాణాలు పాటించాల్సి వచ్చేది. ప్రజల ఆరోగ్యానికి అసలైన ప్రమాదకారి ఈ నిల్వ ఉంచే పదార్థమే. అయితే ఇది మోతాదు మించితే మనుషుల ప్రాణాలకే ముప్పు. వ్యాపారులు లాభాపేక్షతో తమ ఉత్పత్తులు మార్కెట్లో త్వరగా పాడవకుండా ఉండేందుకు ఈ పదార్థాల మోతాదును ఎక్కువ కలుపుతారనే విషయం ఎవరైనా గ్రహించగలరు. 'మ్యాగీ' నూడిల్స్‌లో మోతాదుకు మించి సీసం ఉందన్న కారణంగా కొంతకాలం వాటి ఉత్పత్తులను మార్కెట్లో నిలిపేసిన విషయం తెల్సిందే. ఇంకా అప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు నోటిఫై కాలేదు. గుడ్డిగా ప్రోత్సహించడంతోనే భారతీయ మార్కెట్లో ఆహారోత్పత్తుల కంపెనీలను ప్రోత్సహించాలనే అత్యుత్సాహంతో కేంద్ర ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను సడలిస్తూ వస్తున్నాయి. 2025 నాటికి దేశంలో ఏటా 72 లక్షల కోట్ల ఈ ఆహరపదార్థాల వ్యాపారం నడుస్తుందని, వాటిలో ఏటా 60 లక్షల కోట్ల రూపాయలు లాభాలే ఉంటాయన్నది ఓ అంచనా. ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతా ప్రమాణాలను పణంగా పెట్టినప్పుడు ఇన్ని కోట్ల వ్యాపారం ఎవరి కోసం!? అమెరికా, యూరోపియన్ యూనియన్లు తమ ఆహార భద్రతా ప్రమాణాలను రోజురోజుకు కఠినం చేస్తూ వెళుతుంటే మన దేశం సడలిస్తూ రావడం విచిత్రం. -
గ్రీన్ టీ మంచిదే... కానీ?!
కొలెస్ట్రాల్ కరిగించడానికి, బరువు తగ్గించడానికి గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజుకు రెండు కప్పులకు మించి గ్రీన్ టీని కడుపులో వేస్తే, అది చాలా సమస్యల్ని మీ గడపలోకి తీసుకొస్తుందంటున్నారు పరిశోధకులు. వాళ్లు చెబుతున్నదాని ప్రకారం... గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫీన్ ఉంటుంది. ఉండదనుకుని రోజుకు నాలుగైదు కప్పులు లాగిస్తే, శరీరంలోకి కెఫీన్ ఎక్కువగానే చేరిపోతుంది గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే... గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందట గ్రీన్ టీలోని పాలీఫినాల్స్ మోతాదు మించి శరీరంలో చేరినట్లయితే, క్యాన్సర్‌ని నిరోధించే కణాలను అడ్డుకుంటాయని తేలింది ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి గ్రీన్ టీలో ఉంటే ట్యానిన్స్... ఆహారం, పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఇనుమును అడ్డుకుంటాయి .చూశారుగా! ఒక్కోసారి మనం మంచనుకున్నది మన పాలిట చెడవుతుంది. కాబట్టి దేని విషయంలోనైనా అతి ప్రమాదమే! -
కాఫీ అతిగా సేవిస్తే ప్రమాదమే!
లండన్: కుదిరితే ఒక కప్పు కాఫీ అలవాటుకు ఇక దూరంగా ఉండాల్సిందేనా! ఆ అలవాటు తగ్గించుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాఫీని మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ, అతిగా సేవిస్తేనే ప్రమాదమంటున్నారు వీరు. తాజాగా దీనిపై బ్రిటన్ లోని 'గ్లెన్ హాస్పిటల్ బ్రిస్టల్' చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాఫీ, టీ, చాక్ లెట్ లో ఉండే కఫైన్ అనే పదార్థం అధికంగా శరీరంలోకి వెళ్తే ప్రమాదమేనట. కఫైన్ 400 మిల్లి గ్రాములకు మించి శరీరంలోకి పంపిస్తే.. గుండె జబ్బులతోపాటు, రక్తపోటు తదితర సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామాలు చేసేవారు కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ అధికమయ్యే అవకాశాలే మెండుగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. రోజుకు మూడు కప్పులు మించి కాఫీని సేవించే వారికి రాత్రిపూట నిద్రలేమి సమస్యలు కూడా అధికంగానే ఉంటాయట. ఈ తరహా అలవాటు ఉన్నవారికి పూర్తిస్థాయి నిద్ర పట్టకపోవడం సైంటిఫిక్ గా నిరూపితమైందని పరిశోధకులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.