Consumption of coffee Daily can prevent development of Alzheimer's disease: ప్రతి ఉదయం వేడివేడిగా కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అటువంటి కాఫీ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్! కాఫీ తాగనివారితో పోల్చితే తాగేవారికి మతిమరుపు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.
ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై 10 యేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీతాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపారు.
ముఖ్యంగా మెదడులోని అల్జీమర్స్ అభివృద్ధలో కీలకంగా వ్యవహరించే అమిలాయిడ్ ప్రొటీన్‌ను నిరోధించడంలో కాఫీలోని కారకాలు ఉపయోగపడతాయని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి కాఫీ తాగడం సులువైన మార్గమని పేర్కొన్నారు. మతిమరుపుతో బాధపడే వ్యక్తులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పవచ్చు.
చదవండి: కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం..
మధ్య వయస్సు వ్యక్తుల జీవనశైలిలో కాఫీని తప్పకుండా చేర్చుకోవాలి. రోజుకు 240 గ్రాముల చొప్పున ఒక కప్పు కాఫీ తాగేవారైతే, అదనంగా మరో కప్పును చేర్చడం మంచిది. ఫలితంగా 18 నెలల తర్వాత 8% వరకు మతిమరుపు సమస్య నివారణ ఔతుందని, అదేవిధంగా మెదడులో అమిలాయిడ్ ప్రొటీన్ ఏర్పడటం 5% తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడులో అమిలాయిడ్ బలమైన ఫలకాలు ఏర్పడేలా చేసి అల్జీమర్స్ వ్యాధిదారి తీస్తుంది.
మెదడు ఆరోగ్యంపై కాఫీలో ఏ కారకాలు సానుకూలంగా పనిచేస్తున్నాయనే అంశంపై ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి ఇది ఏకైక కారణమని దీనిపై మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందని పరిశోధకులు తెలిపారు.
చదవండి: అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!!
Comments
Please login to add a commentAdd a comment