Cognition
-
గుడ్‌న్యూస్! కాఫీతాగే అలవాటు మతిమరుపును నివారిస్తుంది.. ఎలాగంటే..
Consumption of coffee Daily can prevent development of Alzheimer's disease: ప్రతి ఉదయం వేడివేడిగా కప్పు కాఫీ తాగందే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అటువంటి కాఫీ ప్రియులకు ఓ గుడ్‌న్యూస్! కాఫీ తాగనివారితో పోల్చితే తాగేవారికి మతిమరుపు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై 10 యేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీతాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతున్నట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా మెదడులోని అల్జీమర్స్ అభివృద్ధలో కీలకంగా వ్యవహరించే అమిలాయిడ్ ప్రొటీన్‌ను నిరోధించడంలో కాఫీలోని కారకాలు ఉపయోగపడతాయని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి కాఫీ తాగడం సులువైన మార్గమని పేర్కొన్నారు. మతిమరుపుతో బాధపడే వ్యక్తులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పవచ్చు. చదవండి: కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం.. మధ్య వయస్సు వ్యక్తుల జీవనశైలిలో కాఫీని తప్పకుండా చేర్చుకోవాలి. రోజుకు 240 గ్రాముల చొప్పున ఒక కప్పు కాఫీ తాగేవారైతే, అదనంగా మరో కప్పును చేర్చడం మంచిది. ఫలితంగా 18 నెలల తర్వాత 8% వరకు మతిమరుపు సమస్య నివారణ ఔతుందని, అదేవిధంగా మెదడులో అమిలాయిడ్ ప్రొటీన్ ఏర్పడటం 5% తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడులో అమిలాయిడ్ బలమైన ఫలకాలు ఏర్పడేలా చేసి అల్జీమర్స్ వ్యాధిదారి తీస్తుంది. మెదడు ఆరోగ్యంపై కాఫీలో ఏ కారకాలు సానుకూలంగా పనిచేస్తున్నాయనే అంశంపై ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అల్జీమర్స్ వ్యాధిని ఆలస్యం చేయడానికి ఇది ఏకైక కారణమని దీనిపై మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందని పరిశోధకులు తెలిపారు. చదవండి: అతనికి అదృష్టం 17 కేజీల ఉల్కరూపంలో తగిలింది.. బంగారం కంటే ఎన్నో రెట్లు!! -
యోగ... ఆధ్యాత్మిక... ఆరోగ్యానికి ఈ మూడూ
పుస్తకం ప్రముఖ ఆధ్యాత్మిక, యోగ గురువు స్వామి మైత్రేయ ‘యోగక్షేమం’, ‘ఆనందోబ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ’, ‘ఆయుష్మాన్ భవ’ అంటూ మేలిముత్యాల్లాంటి మూడు మంచి పుస్తకాలను అందించారు. వాటిలో... మానసిక చపలత్వాన్ని అధిగమించి, ఆత్మపరంగా జీవించడానికి దోహదపడేదే యోగ, యోగసాధనే ఆనంద దాయకం అని బోధించే పుస్తకం ‘యోగక్షేమం’ ప్రతివిషయంలోనూ మనకు సమస్యలు, బాధలు, దుఃఖాలే కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఆ క్షణంలో సంపూర్ణంగా, నూటికి నూరుపాళ్లు ఉంటే అప్పుడు బ్రహ్మతత్వం అర్థం అవుతుంది అని వివరించే పుస్తకం ‘ఆనందోబ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ’. ఆహారమనేది నోటిద్వారా తీసుకునేది మాత్రమే కాదు... జ్ఞానసముపార్జన ద్వారా ఇంద్రియాల ద్వారా స్వీకరించే ప్రతిదీ ఆహారమే. నోటిద్వారా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆలోచనలలో, మాటలలో, చేతలలో కూడా మంచిని చేయాలి అని వివరించే పుస్తకమే ‘ఆయుష్మాన్ భవ’. ఇందులో ఆహార నియమాలతోబాటు ఆలోచనలలో, మాటలలో, చేతలలో పాటించవలసిన విధివిధానాలను, కొన్ని యోగాసనాలను సచిత్రంగా అందించారు. యోగక్షేమం పుటలు:168; వెల రూ. 150 ఆనందోబ్రహ్మ పుటలు: 158; వెల రూ. 100 ఆయుష్మాన్ భవ పుటలు: 224; వెల రూ. 180 ప్రతులకు: శ్రీమతి కేబీ లక్ష్మి, 17-141, శ్రీ నిలయం, రామాలయానికి ముందు సందు, కమలానగర్ డెడ్‌లైన్, రోడ్‌నంబర్ 3, దిల్సుఖ్నగర్ బస్‌డిపో తర్వాత, చైతన్యపురి ఎక్స్ రోడ్ వద్ద, ఇండియన్ బ్యాంక్ సందు, హైదరాబాద్- 5000060. ఫోన్: - డీవీఆర్