యోగ... ఆధ్యాత్మిక... ఆరోగ్యానికి ఈ మూడూ
పుస్తకం
ప్రముఖ ఆధ్యాత్మిక, యోగ గురువు స్వామి మైత్రేయ ‘యోగక్షేమం’, ‘ఆనందోబ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ’, ‘ఆయుష్మాన్ భవ’ అంటూ మేలిముత్యాల్లాంటి మూడు మంచి పుస్తకాలను అందించారు. వాటిలో... మానసిక చపలత్వాన్ని అధిగమించి, ఆత్మపరంగా జీవించడానికి దోహదపడేదే యోగ, యోగసాధనే ఆనంద దాయకం అని బోధించే పుస్తకం ‘యోగక్షేమం’ ప్రతివిషయంలోనూ మనకు సమస్యలు, బాధలు, దుఃఖాలే కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఆ క్షణంలో సంపూర్ణంగా, నూటికి నూరుపాళ్లు ఉంటే అప్పుడు బ్రహ్మతత్వం అర్థం అవుతుంది అని వివరించే పుస్తకం ‘ఆనందోబ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ’. ఆహారమనేది నోటిద్వారా తీసుకునేది మాత్రమే కాదు... జ్ఞానసముపార్జన ద్వారా ఇంద్రియాల ద్వారా స్వీకరించే ప్రతిదీ ఆహారమే. నోటిద్వారా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆలోచనలలో, మాటలలో, చేతలలో కూడా మంచిని చేయాలి అని వివరించే పుస్తకమే ‘ఆయుష్మాన్ భవ’. ఇందులో ఆహార నియమాలతోబాటు ఆలోచనలలో, మాటలలో, చేతలలో పాటించవలసిన విధివిధానాలను, కొన్ని యోగాసనాలను సచిత్రంగా అందించారు.
యోగక్షేమం పుటలు:168; వెల రూ. 150
ఆనందోబ్రహ్మ పుటలు: 158; వెల రూ. 100
ఆయుష్మాన్ భవ పుటలు: 224; వెల రూ. 180
ప్రతులకు: శ్రీమతి కేబీ లక్ష్మి, 17-141, శ్రీ నిలయం, రామాలయానికి ముందు సందు, కమలానగర్ డెడ్‌లైన్, రోడ్‌నంబర్ 3, దిల్‌సుఖ్‌నగర్ బస్‌డిపో తర్వాత, చైతన్యపురి ఎక్స్ రోడ్ వద్ద, ఇండియన్ బ్యాంక్ సందు, హైదరాబాద్- 5000060. ఫోన్:
- డీవీఆర్