
ఎనర్జీ డ్రింక్‌లతో చేటు..
లండన్ : ఒక ఎనర్జీ డ్రింక్‌తో కేవలం 90 నిమిషాల్లోనే గుండె పోటు, స్ర్టోక్ ముప్పు పెరిగే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఎనర్జీ డ్రింక్‌లు రక్త నాళాలను పెళుసుబారేలా చేయడంతో కీలక అవయవాలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయని హోస్టన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు పేర్కొన్నారు. గతంలో రెడ్ బుల్, మాన్‌స్టర్ వంటి ఎనర్జీ డ్రింక్‌లకు కడుపు, నరాలు, గుండె సమస్యలకు మధ్య సంబంధాన్ని పలు అథ్యయనాలు పేర్కొన్నా వీటిని అతిగా సేవించడం వల్ల దుష్పరిణామాలు ఉంటాయని వెల్లడించాయి.
అయితే ఎనర్జీ డ్రింక్ తీసుకున్న 90 నిమిషాల్లోనే రక్తనాళాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తాజా అథ్యయనం పేర్కొంది. ఎనర్జీ డ్రింక్‌ల్లో కలిపే కేఫిన్, టారిన్, చక్కెర ఇతర హెర్చల్స్ రక్తనాళాలపై ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు అంచనా వేశారు. ఎనర్జీ డ్రింక్‌ల్లో చక్కెర శాతం అధికంగా ఉండటం గమనార్హం.
కెఫిన్ సైతం రక్త నాళాలు కుచించకుపోయేలా చేస్తుందని, తాత్కాలికంగా బీపీని పెంచే అడ్రినలైన్ హోర్మోన్‌ను విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్‌ల వాడకం పెరుగుతున్నందున వీటి అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మెక్ గవర్న్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ హిగ్గిన్స్ సూచించారు.