ముంబై: ముంబై వైద్యులు తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స నిర్వహించారు. 2017లో మానసిక ఆరోగ్యచట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి డిప్రెషన్ సర్జరీ ఇదేకావడం విశేషం. ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ గత 26 ఏళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోంది.
మహారాష్ట్ర మెంటల్ హెల్త్ బోర్డు అనుమతితో జస్‌లోక్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్ డాక్టర్ పరేఖ్ దోషి నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించింది. దీనిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) సర్జరీ అని అంటారు. పార్కిన్‌సన్స్ దగ్గర్నుంచి నరాల వ్యవస్థలో లోపాల కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధులకి డీబీఎస్ శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment