మెజారిటీ వ్యాధులకు మూలం మనసే | Mental Health: The Root of Physical Well-being | Sakshi
Sakshi News home page

మెజారిటీ వ్యాధులకు మూలం మనసే

Aug 17 2025 12:25 PM | Updated on Aug 17 2025 12:25 PM

Mental Health: The Root of Physical Well-being

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఈ మాట మనకు అంతగా రుచించకపోయినా, ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లొస్తే బా..గా... అర్థమవుతుంది. అందుకే ఈ మధ్య హెల్త్ కాన్షన్ బాగా పెరిగింది. అయితే నిజానికి అర్థం కావాల్సింది మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం లేదన్నదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే మాట చెప్తోంది.

వైరస్, బాక్టీరియా, గాయాలు, జన్యుపరమైన సమస్యలు తప్ప, మిగతా దీర్ఘకాలిక వ్యాధుల్లో మన భావోద్వేగాలు, జీవనశైలి, ఆలోచనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనకు వచ్చే శారీరక వ్యాధుల్లో 70 శాతం cవల్లేనన్నది సైంటిఫిక్ స్టడీస్ లో తెలిసిన, తెలుస్తున్న విషయం.

శరీరం-మనసు మధ్య unresolved conflicts వల్లే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయనేది భయపెట్టే విషయం కాదు, నిజానికి ఆశ కలిగించే సత్యం. ఎందుకంటే జబ్బుకు మూలం మనసులో ఉంటే, పరిష్కారం కూడా మనసునుండే మొదలవుతుంది.

సైకోసొమాటిక్ మోడల్
‘సైకోసొమాటిక్’ అంటే మానసిక-భావోద్వేగ కారకాలు శరీరంపై ప్రభావం చూపుతాయని. మనసు (psyche) లో మొదలైన బాధ, మెదడు (brain) ద్వారా సంకేతమై, శరీరం (soma)లో వ్యక్తమవుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, అణచివేసిన భావాలు, భయం, బాధ, కోపం-ఇవి నాడీవ్యవస్థ సిగ్నల్స్‌ ద్వారా హార్మోన్లు, ఇమ్యూన్ వ్యవస్థ, అవయవాల పనితీరును మార్చుతాయి. ఫలితంగా మైగ్రేన్ నుంచి IBS వరకు, ఆస్తమా నుంచి నిద్రలేమి వరకు చాలా సమస్యలు ముదిరిపోతాయి లేదా తిరిగి తిరిగి వస్తుంటాయి. ఎన్ని మందులు వాడినా తగ్గవు.

  • ఒత్తిడి సంబంధిత ప్రధాన వ్యాధులు
    హృదయ సంబంధ వ్యాధులు – Emotional stress → Sympathetic overdrive → హార్ట్ ఎటాక్ రిస్క్.
    డయాబెటీస్ – Chronic anger/overwhelm → Insulin resistance.
    ఆటో–ఇమ్యూన్ డిసార్డర్స్ – Emotional suppression → Immune dysregulation.
    జీర్ణ సంబంధ వ్యాధులు – Anxiety → IBS, acid reflux.
    చర్మ సమస్యలు – Stress → Psoriasis, eczema flare-ups.

  • సైంటిఫిక్ ఆధారాలు
    ప్రైమరీకేర్ విజిట్స్ లో 60 నుంచి 80 శాతం ఫిర్యాదులు, అంటే తలనొప్పులు, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, బీపీ, అలసట, చర్యవ్యాధులు లాంటి వాటికి మానసిక ఒత్తిడే కారణమని అమెరికన్ ఫ్యామిలీ మెడిసిన్ జర్నల్ (2012) చెప్తోంది. 

  • గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ లో మానసిక ఒత్తిడి,  లైఫ్‌స్టైల్ ఫ్యాక్టర్స్ ప్రధాన పునాది అని ప్రపంచ ఆరోగ్యం సంస్థ 2017లో పేర్కొంది.

  • దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడటం, ఇన్ఫ్లమేషన్ పెరగడం, హార్మోనల్ డిస్టర్బెన్స్ రావడం... ఇవి అనేక వ్యాధులకు కారణమని హార్వర్డ్ మెడికల్ స్కూల్ రివ్యూ ఆర్టికల్ (2013) నిర్ధారించింది.

  • ఎలా అంచనా వేయాలి? 
    గత రెండు మూడేళ్లుగా పని ఒత్తిడి, ఇంటి సమస్యలు, నష్టాలు, అనారోగ్యాలు, నిద్రలేమిని గమనించండి. 
    ఏ లక్షణం ఎప్పుడు చెలరేగుతుంది? ఎవరి దగ్గర, ఏ మాటలకు, ఏ సన్నివేశం తర్వాత చెలరేగుతుందో గుర్తించండి. 
    ఒత్తిడి, నొప్పి, అలసట, మూడ్, నిద్ర రోజువారీగా ఎలా ఉందో 0-10 స్కేల్ పై స్కోర్ చేయండి. వారినికి ఒకసారి గ్రాఫ్ చూసుకోండి. 
    ఆకస్మికంగా ఛాతీనొప్పి, జ్వరం, తీవ్ర అలసటలాంటివి అనిపిస్తే తక్షణమే డాక్టర్ ను కలవండి.

సమతుల్యతతోనే పరిష్కారం...
1) నిద్ర, ఆహారం, కదలిక బ్యాలెన్స్ డ్ గా ఉండాలి. రోజుకు 7-9 గంటల నిద్ర ఒకే సమయంలో ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి... ప్రొటీన్, ఫైబర్, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 30-45 నిమిషాల నడక ఉండాలి. 
2) నర్వస్-సిస్టమ్ రెగ్యులేషన్ ను ప్రాక్టీస్ చేయాలి. నిమిషానికి ఐదారు శ్వాసలు ఉండేలా 8-10 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. హమ్మింగ్ గార్గ్లింగ్, బాడీ స్కాన్ లాంటి ఎక్సర్సైజ్ ల ద్వారా వాగస్ నెర్వ్ ను బూస్ట్ చేయాలి. 
3) మీరేం ఫీలవుతున్నారో అది రోజుకు పదినిమిషాలు రాయండి. సీబీటీ, యాక్ట్ లాంటి సైకోథెరపీ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. 
“ఏం ఫీల్ అవుతున్నాను? దానికి నేను ఏ పేరుపెడతాను? నేడు చిన్నగా ఎలా విడుదల చేస్తాను?”
ఎమోషన్ ప్రాసెసింగ్
4) ఎదుటివారి మాటను యాక్టివ్ గా వినడం, ఒంటరితనపు ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఔషధం. అవసరమైనప్పుడు ‘ఇప్పుడు కాదు, రేపు ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పడం నేర్చుకోండి. 
5) వారానికొకసారి మీ జీవితానికి అర్థం, పరమార్థం, విలువలు, విశ్వాసాల గురించి చిన్న లిస్ట్ రాయండి. 
6) మనసుతో చేసే పనులకు మందులు, డైట్, ఎక్సర్సైజ్ లు తోడైతే ఫలితం త్వరగా కనిపిస్తుంది. 

సైకాలజిస్ట్ విశేష్
8019 000066
www.psyvisesh.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement