డబ్బే జీవితంగా బతుకుతుంటారు కొందరూ. అందుకోసం తన పర అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. బంధాలన్నింటిని డబ్బుతోనే చూస్తారు. నిజానికి అదొక స్టాటస్ ఆఫ్ సింబల్. కాస్త డబ్బు పలుకుబడి ఉంటేనే సమాజంలో గౌరవం కూడా. అయితే అదే డబ్బు మనిషికి కొంచెం కూడా మనశ్శాంతిని, నమ్మకమైన వ్యక్తులను ఇవ్వలేదు అనే నిజం తెలిసేలోపే అన్నింటిని కోల్పోతాం. ఏం కావాలో తెలియక మనో వ్యధకు గురవ్వుతాం. అచ్చం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు ఓ మిలియనీర్. పాపం డబ్బే సర్వం అనుకున్నాడు ఇప్పుడదే అతడికి మనశాంతిని దూరం చేసింది.
అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన జేక్ కాసన్ అనే కాలేజ్ డ్రాపౌట్ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు. సంపదే తనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. చిన్న వయసులోనే లాస్ ఏంజిల్స్‌కు చెందిన యాక్సెసరీ బ్రాండ్ MVMT వాచెస్ కంపెనీని స్థాపించాడు. అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 27 ఏళ్ల వయసుకి తన బ్రాండ్‌కి ఉన్న ఇమేజ్ చూసి ఏకంగా రూ. 871 కోట్లకు విక్రయించాడు.
మిలియనీర్‌గా మారాలన్న అతడి కల నెరవేరింది. కానీ అదే అతడికి కష్టాలు, కన్నీళ్లని తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు అయ్యాడో అక్కడ నుంచి వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ 30 ఏళ్లకే వైవాహిక జీవితంలో బ్రేక్‌అప్‌లు, ఏదో లక్ష్యం కోల్పోయినట్లు మనశ్శాంతి లేకపోవడం తదితరాలు చుట్టుముట్టాయి.
అయితే అతడికి ఎందరో ప్రాణ స్నేహితులు ఉన్నా.. తన ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయి. ఏదో కావాలన్న ఆరాటం..కానీ ఏం కావాలో తెలియక ఒక విధమైన నైరాశ్యంతో కొట్టుమిట్టాడాడు. చివరికి అదికాస్తా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. "డబ్బే అనందాన్ని ఇస్తుందనుకుని కష్టపడి స్థాపించిన కంపెనీని అమ్మేశాను అదే నేను చేసిన తప్పు. వ్యవస్థాపక ప్రయాణం అత్యం అమూల్యమైనది. ఒక కంపెనీని స్థాపించి దాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడంలో ఉన్న ఆనందం కిక్కు వేరు.
డబ్బులు పోగేసుకోవడంలో లేదనే విషయం గ్రహించేలోపే..వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన మనశ్శాంతిని కోల్పోయా". అంటూ విలపిస్తున్నాడు కాసన్. అందుకే మళ్లీ పనిలో పడాలని నిర్ణయించుకుని యూట్యూబ్ చానెల్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అలాగే తన బ్రాండ్‌కి పెట్టుబడిదారుడిగా ఉండాలని చూస్తున్నాడు.
ఇతడి స్టోరీ ఓ గొప్ప విషయాన్ని చాటి చెప్పింది. "డబ్బు వెంట పరిగెడితే మనశ్శాంతి ఉండదు..కష్టపడటంలోనే ఆత్శసంతృప్తి ఉంటుందనే సత్యాన్ని చాటి చెబుతోంది కదూ..!. అయినా అవసరానికి మించిన ధనం కూడా చేటేనేమో..!."
(చదవండి: ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి..!)
Comments
Please login to add a commentAdd a comment