సైకిల్‌ ర్యాలితో మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు | Cycle Rally In Delhi To Create Awareness on Mental Health | Sakshi
Sakshi News home page

Create Awareness on Mental Health: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు"

Published Sun, Oct 10 2021 4:11 PM | Last Updated on Sun, Oct 10 2021 5:10 PM

Cycle Rally In Delhi To Create Awareness on Mental Health - Sakshi

ఢిల్లీ: మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా దేశ రాజధాని ఢిల్లీలో సైక్లోథాన్‌ లేదా సైకిల్‌ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని వీ4ఏ సైక్లింగ్‌ అండ్‌ రన్నింగ్‌ క్లబ్‌ భాగస్వామ్యంతో ఏడీఆర్‌ఏ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది యువకులు గ్రీన్‌ టీ షర్ట్స్‌ ధరించి క్రోన్‌ ప్లాజా, ఓక్లా తదితర ప్రాంతాల నుంచి కుతిబ్‌మినార్‌ వరకు ర్యాలీ చేశారు.

((చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’)

ఈ సందర్భంగా ఏఆర్‌డీఏ డైరెక్టర్‌ వెస్టన్‌ డేవిస్‌ మాట్లాడుతూ..."ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా స్నేహితులు, కొలిగ్స్‌ ద్వారా సరికొత్త సమస్యలను తెలుసుకోగలం. అంతేకాదు ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రజలకు తెలియజేయగలుగుతాం. ఈ కార్యక్రమాల ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు మా వంతు సాయం అందిచగలుగుతున్నాం" అని చెప్పారు.

2017లో భారతదేశంలో జరిపిన అధ్యయనాల్లో ప్రతి ఏడు గురు భారతీయుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సోసైటీలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కొంత వివక్షకు గురవుతున్నట్లు కూడా అధ్యయనాలు వెల్లడించాయి. కోడిడ్‌-19 మహమ్మారి కారణంగా తమ వాళ్లను కోల్పోవడం లేదా ఉపాధి కోల్పోవడం వంటి తదితర కారణాలతో మానసిక రోగుల సంఖ్య పెరిగిందని అందువల్లే ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు  ఏడీఆర్‌ఏ ఇండియా పేర్కొంది.

(చదవండి: "కదిలే టాటుల అద్భుతమైన వీడియో")

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement