cyciling
-
సైకిల్ ర్యాలితో మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు
ఢిల్లీ: మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా దేశ రాజధాని ఢిల్లీలో సైక్లోథాన్ లేదా సైకిల్ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని వీ4ఏ సైక్లింగ్ అండ్ రన్నింగ్ క్లబ్ భాగస్వామ్యంతో ఏడీఆర్‌ఏ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది యువకులు గ్రీన్ టీ షర్ట్స్ ధరించి క్రోన్ ప్లాజా, ఓక్లా తదితర ప్రాంతాల నుంచి కుతిబ్మినార్ వరకు ర్యాలీ చేశారు. ((చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) ఈ సందర్భంగా ఏఆర్‌డీఏ డైరెక్టర్ వెస్టన్ డేవిస్ మాట్లాడుతూ..."ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా స్నేహితులు, కొలిగ్స్ ద్వారా సరికొత్త సమస్యలను తెలుసుకోగలం. అంతేకాదు ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రజలకు తెలియజేయగలుగుతాం. ఈ కార్యక్రమాల ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు మా వంతు సాయం అందిచగలుగుతున్నాం" అని చెప్పారు. 2017లో భారతదేశంలో జరిపిన అధ్యయనాల్లో ప్రతి ఏడు గురు భారతీయుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సోసైటీలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కొంత వివక్షకు గురవుతున్నట్లు కూడా అధ్యయనాలు వెల్లడించాయి. కోడిడ్-19 మహమ్మారి కారణంగా తమ వాళ్లను కోల్పోవడం లేదా ఉపాధి కోల్పోవడం వంటి తదితర కారణాలతో మానసిక రోగుల సంఖ్య పెరిగిందని అందువల్లే ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు ఏడీఆర్‌ఏ ఇండియా పేర్కొంది. (చదవండి: "కదిలే టాటుల అద్భుతమైన వీడియో") -
‘మేడ్ ఇన్ ఇండియా’ సైకిల్‌పై బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యపరిచారు. కరోనాపై పోరులో భాగాంగా స్థూలకాయానికి (ఒబెసిటీ)కి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం చేపట్టిన కొత్త జీబీపీ 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన బోరిస్.. దానిలో భాగంగా నాటింగ్‌హామ్‌లోని బీస్టన్ వద్ద ఉన్న హెరిటేజ్ సెంటర్లో సైకిల్ తొక్కారు. 56 ఏళ్ళ బోరిస్‌కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టమట. హెల్త్, ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చాలా మంచిదని ఆయన అంటున్నారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో చాలామంది స్థూలకాయులేనని, మితిమీరిన శరీర బరువు వల్ల వారు మృత్యువాత పడుతున్నారని కొందరు నిపుణులు ఇటీవల తేల్చారు. దాంతో ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న ఉద్దేశంతో బిట్రన్ ప్రభుత్వం ఇప్పటికే ఆహార పదార్థలపై ఇచ్చే వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా బోరిస్ ఈ సైక్లింగ్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ప్రధాని తొక్కిన సైకిల్ ఇండియాకు చెందిన హీరో మోటార్స్ కంపెనీది. వికింగ్ ప్రో బైక్ పేరుతో ఆ సైకిల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. మాంచెస్టర్‌లో సైకిల్‌ను డిజైన్ చేశారు. (ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక) సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడే బోరిస్.. దేశంలో వేల కిలోమీటర్ల బైక్ లేన్లను ఆవిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త ఫిట్నెస్ స్ట్రాటజీలో భాగంగా ప్రభుత్వం సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ వేయనున్నట్లు తెలిపింది. అంతేకాక నిత్య జీవితంలో సైక్లింగ్‌ను ప్రొత్సాహించడానికి గాను రవాణా కేంద్రాలు, పట్టణం, నగర కేంద్రాలు, ప్రభుత్వ భవనాల వద్ద మరిన్ని సైకిల్ రాక్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇళ్లలో పార్కింగ్ స్థంల లేని వారి కోసం వీధుల్లో రాక్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైక్లింగ్ వల్ల ఫిట్‌గా ఉండటమే కాక గాలి నాణ్యత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరతాయన్నారు బోరిస్. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు) -
సైక్లింగ్ అకాడమీకి ఎంపిక
హుస్నాబాద్‌రూరల్: హైదరాబాద్‌లోని సైక్లింగ్ అకాడమీకి కరీంనగర్ జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు సంజీవ్‌కుమార్, జంగపెల్లి వెంకటనర్సయ్య తెలిపారు. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన శారీరకదారుఢ్య పరీక్షలో నెగ్గి అకాడమీకి ఎంపికయ్యారని చెప్పారు. హుస్నాబాద్ మండలానికి చెందిన సాయితరుణ్(గౌరవెల్లి), కట్టమీది జీవన్, టి.నవీన్(రామవరం), సూర్యతేజ(జెయింట్ జోసఫ్), కె.దీపక్తేజ, అభిరామ్ (కరీంనగర్)కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. వారి ఎంపికపై మారంపెల్లి అర్జున్, రంగానాయక్ హర్షం వ్యక్తం చేశారు.