మనిషి జీవితం 40 ఏళ్ళకి ముందు ఒకలా, ఆ తరువాత మరొకలా ఉంటుంది. బాధ్యతలు పెరగటం వల్ల, శరీర మార్పుల వల్ల, రకరకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం కావడం మొదలవుతుంది. అందుకే ఆ వయసుకి రాగానే మన జీవన సరళిలో మార్పులు చేయాలి. ఆ మార్పులేమిటో తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం.
జీవన సరళిలో చేసుకోవాల్సిన మార్పులు
- నాలుగు పదుల వయసు వచ్చేసరికి కండరాల్లో సాంద్రత తగ్గుతూ ఉంటుంది. రక్త సరఫరా కూడా నెమ్మదిస్తుంటుంది కాబట్టి, దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
- అన్నం పరిమాణాన్ని తగ్గించాలి. తాజాఫలాలు ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి.
- కంటిచూపు మందగించకుండా విటమిన్ ఎ, సి ఉండే పదార్థాలు తినాలి.
- మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి.
- ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే నీళ్ళు బాగా తాగాలి.
- వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ చూసుకోండి. ఫ్యాట్ ఉంటే కరిగించండి.
- బలహీనంగా ఉంటే బరువు పెంచండి. విటమిన్ ఎ, సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి.
- రోగనిరోధకశక్తి పెంచుకోవాలి.
- మెంటల్ హెల్త్ బాగుండాలంటే ప్రశాంతంగా ఉంటూ తగినంత నిద్ర పోవడం అవసరం.
(చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment