‘ఆమె ఇడియట్‌ కాదు.. నాకు చాలా ఇష్టం’ | I Like Pamela Anderson, She's No Idiot At All : Julian Assange | Sakshi
Sakshi News home page

‘ఆమె ఇడియట్‌ కాదు.. నాకు చాలా ఇష్టం’

Published Thu, Feb 16 2017 10:59 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

‘ఆమె ఇడియట్‌ కాదు.. నాకు చాలా ఇష్టం’

‘ఆమె ఇడియట్‌ కాదు.. నాకు చాలా ఇష్టం’

లాస్‌ఎంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటి, మోడల్‌ పమీలా ఆండర్సన్‌ అంటే తనకు చాలా ఇష్టం అని వికిలీక్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే చెప్పారు. వారిద్దరి మధ్య ఏదో రోమాంటికల్‌ రిలేషన్‌ ఉందంటూ వస్తున్న ఊహగానాలకు అసాంజే ఈ విషయంతో మరింత స్పష్టతనిచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె ఇడియట్‌ కాదని, చాలా మంచిదని తెలిపారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో అసాంజే ఈ విషయాలు చెప్పినట్లు బ్రిటన్‌ పత్రిక ఒకటి తెలిపింది.

తనది ఎంతో ఆకర్షణీయమైన, ఆకట్టుకోగల ఆహార్యం అంటూ కూడా అసాంజే అన్నట్లు ఆ పత్రిక వివరించింది. పమీలా చాలా బలమైన మనస్తత్వం కలిగిన వనిత. ఆమె ఏ మాత్రం ఇడియట్‌ కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. నేను ఆమెను చాలా ఇష్టపడతాను. ఆమె చాలా గొప్ప స్త్రీ కూడా. ఇంతకంటే ప్రైవేటు విషయాలు నేను చెప్పలేను. చాలా మంది ఆమె స్వేచ్ఛగా స్వతంత్ర్యంగా తిరుగుతుందని అంటుంటారు. కానీ, ఎవరి జీవితాన్ని వారే సజావుగా నడుపుకోవచ్చని చెప్పేందుకు ఆమె ఒక మోడల్‌ కూడా’ అని అసాంజే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement