wikileaks founder
-
అసాంజ్‌కు ఎట్టకేలకు స్వేచ్ఛ!
వాషింగ్టన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఆయనను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐదేళ్లుగా బ్రిటన్‌లో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో అసాంజ్ విడుదలకు మార్గం సుగమమయ్యింది. దాని ప్రకారం అమెరికా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు యూకే జైలు నుంచి ఆయన మంగళవారం ఉదయం విడుదలయ్యారు.చార్టర్డ్ విమానంలో ఉత్తర మరియానా ఐలాండ్స్‌లోని సైపన్ ద్వీపానికి బయల్దేరారు. అక్కడి అమెరికా ఫెడరల్ కోర్టులో బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణకు హాజరవుతారు. అమెరికా వెళ్లడానికి అసాంజ్ నిరాకరించడంతో ఆ్రస్టేలియా సమీపంలో అమెరికా అ«దీనంలో ఉండే ఈ ప్రాంతంలో విచారణ చేపడుతున్నారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం... గూఢచర్య చట్టాన్ని అతిక్రమిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలను అసాంజ్ అంగీకరించనున్నట్లు సమాచారం.ఆయనపై మోపిన 18 అభియోగాలను కలిపి ఒకే కేసుగా విచారించనున్నట్లు తెలుస్తోంది. అసాంజ్ నేరాంగీకార వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ఆయనకు శిక్ష ఖరారు చేస్తారు. ఇప్పటికే బ్రిటన్‌లో అనుభవించిన ఐదేళ్ల శిక్షతో సరిపెట్టి విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే ఆ వెంటనే అసాంజ్ నేరుగా స్వదేశం ఆ్రస్టేలియాకు వెళ్లనున్నారు. ధ్రువీకరించిన వికీలీక్స్ అసాంజ్ విడుదలను వికీలీక్స్ సంస్థ ధ్రువీకరించింది. ఈ మేరకు సామాజిక వేదిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘1,901 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన జూన్ 24న విడుదలయ్యారు. అసాంజ్ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతిచ్చినవారికి కృతజ్ఞతలు’’ అని తెలిపింది.ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి అసాంజ్ సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజ్ స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజ్ అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.అరెస్టు... ఆశ్రయం జైలుఅసాంజ్ 2010 అక్టోబర్‌లో బ్రిటన్‌లో అరెస్టయ్యారు. తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. అయితే ఆయన్ను స్వీడన్‌కు అప్పగించాలని 2011 ఫిబ్రవరిలో లండన్ కోర్టు ఆదేశించింది. దీనిపై బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా లాభం లేకపోయింది. దాంతో అసాంజ్ కొంతకాలం లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు. 2019 ఏప్రిల్‌లో ఆ ఆశ్రయం రద్దయింది. అనంతరం బ్రిటన్ కోర్టు ఆయనకు 50 వారాల జైలు శిక్ష విధించింది. అమెరికాకు అప్పగింతపై విచారణ పెండింగ్‌లో ఉండటంతో శిక్ష పూర్తయ్యాక కూడా జైలులోనే ఉన్నారు. అసాంజ్ ఆత్మహత్య చేసుకునే ప్రమాదమున్నందున అమెరికాకు అప్పగించడం కుదరదని బ్రిటన్ కోర్టు 2021లో చెప్పింది.ఉత్కంఠగా ఉంది భార్యఅసాంజ్ భార్య స్టెల్లా ఆస్ట్రేలియాలో మీడియాతో మాట్లాడారు. భర్త రాక కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. న్యాయవాది అయిన ఆమె అసాంజ్‌ను 2022లో ఆయన జైల్లో ఉండగానే పెళ్లాడారు. అసాంజ్ చార్టర్డ్ విమాన ప్రయాణ ఖర్చు 5 లక్షల డాలర్లని ఆయన అభిమానులు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించడానికి ఫండ్ రైజింగ్ ప్రచారం మొదలు పెట్టామన్నారు. -
జూలియన్ అసాంజే అప్పగింత తప్పదా?
సుదీర్ఘ చట్టపర తగాదా తర్వాత, లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు 2022 ఏప్రిల్ 20న, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేని అమెరికాకు అప్పగించాలని ఉత్తర్వు జారీచేసింది. బ్రిటన్ హోమ్ సెక్రెటరీ ప్రీతి పటేల్ అతన్ని అమెరికాకు అప్పజెప్పడానికి ‘స్టాంప్’ వేసే స్థితికి వచ్చారు. అమెరికాలో అసాంజేపై గూఢచర్య చట్టం కింద విచారణ జరుగుతుంది. గూఢచారికీ, సమాజ సంరక్షకునికీ మధ్య తేడాను ఈ చట్టంలో వివరించలేదు. చరిత్రలో మొదటిసారి ఈ చట్టాన్ని ఒక పాత్రికేయునికి వర్తింపజేశారు. అసాంజే పాత్రికేయుడు కాదని అమెరికా ప్రభుత్వ వకీలు వాదించారు. ఎడ్వర్డ్ స్నోడెన్ అమెరికా పూర్వ కంప్యూటర్ ఇంటెలిజెన్స్ కన్సల్టెంట్. అమెరికా ప్రభుత్వం సొంత ప్రజల ఫోన్ కాల్స్, అంతర్జాల చర్యలు, వెబ్ కెమెరాలపై నిఘాను నిరూపించే రహస్య పత్రాలను బయట పెట్టారు. ఆయన మీద కూడా గూఢచర్య చట్టం కింద కేసు పెట్టారు. ‘‘అమెరికా న్యాయ శాఖ పాత్రికేయతపై యుద్ధం చేస్తోంది. ఈ కేసు అసాంజేపై కాదు, మీడియా భవిష్యత్తును నిర్ణయించేది’’ అని వ్యాఖ్యానిస్తూ పాత్రికేయునిపై ఈ చట్ట వర్తింపును స్నోడెన్ ఖండించారు. అసాంజేను వాక్ స్వాతంత్య్ర విజేతగా ఒకప్పుడు ప్రధాన స్రవంతి మీడియా ప్రశంసించింది. 2010లో ఆయన అమెరికా కుట్రల రహస్య సమాచారం బయట పెట్టగానే అదే మీడియా అసాంజేను వదిలేసింది. అసాంజే ఈ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేయగలిగినా, కోర్టులో నెగ్గే అవకాశం చాలా తక్కువ. అసాంజే ఆస్ట్రేలియా దేశానికి చెందిన సంపాదకుడు, ప్రచురణకర్త, సామాజిక కార్యకర్త. ఆస్ట్రేలియా అప్రజాస్వామిక ఆగడాలను భరించలేక పారదర్శక సమాజం ఉన్న స్వీడెన్‌లో స్థిరపడ్డారు. 2006లో వికీలీక్స్ స్థాపించాడు. 2010లో వికీలీక్స్ అమెరికా కుతంత్రాల రహస్య సమాచారాన్ని బహిర్గతం చేసింది. వర్గీకరించిన వరుస దస్త్రాలనూ, దౌత్య సంబంధ తంత్రీ సమాచారాన్నీ పెద్ద మొత్తంలో ప్రచురించిన తర్వాత అమెరికా అసాంజేపై 18 నేరాలు మోపింది. ఇవి రుజువయితే వందేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా ఇద్దరు స్వీడెన్ సెక్స్‌వర్కర్లతో అసాంజేపై అసమంజస అత్యాచార కేసులు పెట్టించింది. ఆ కేసుతో సహా గూఢచర్య విచారణను ఎత్తేయాలని స్వీడెన్ 2012లో నిర్ణయించి, 2017లో ఎత్తేసింది. స్వీడెన్ పార్లమెంటులో మితవాదం బలపడిన తర్వాత అసాంజేపై ఎత్తేసిన కేసులను 2019 మేలో తిరగదోడింది. కానీ నవంబర్‌లో విచారణను ఆపేసింది. అసాంజే 12 ఏళ్ల నుండి నిర్బంధంలో ఉన్నారు. ఆయనకు ఆరేళ్ళ క్రితం లండన్‌లోని ఈక్వడోరియన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయ మిచ్చారు. అప్పటి నుండి జైలు జీవితం అనుభవిస్తు న్నారు. బయటికి పోతే లండన్ పోలీసులు అరెస్టు చేసి అమెరికాకు అప్పజెపుతారని భయం. ఈక్వడార్ అధ్యక్షుడు లెనిన్ మోరెనో అసాంజేను అప్పజెప్పి అమెరికాను సంతోషపెట్టాలని నిర్ణయించినప్పటి నుండి ఆయన కష్టాలు పెరిగాయి. 12 ఏళ్ళు దాటినా అమెరికా అసాంజేను కంటిలో ముల్లుగా, పక్కలో బల్లెంలా చూస్తోంది. తమ రహస్య సమాచారాన్ని బయటపెట్టి తమ దేశం పరువు పోగొట్టాడని భావిస్తోంది. (క్లిక్: అసమ్మతి గళాలపై అసహనం) అసాంజే వికీలీక్స్ ఘటన తర్వాత అమెరికాను ముగ్గురు అధ్యక్షులు పాలించారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ‘రక్షణల’ నిజ స్వరూపం తెలిసింది. అమెరికా అంతర్జాతీయ సమాజ నియమాలు, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి, మానవ హక్కుల హననానికి పాల్పడుతున్న వైనాన్ని బయటపెట్టే ఎవరినైనా యునైటెడ్ కింగ్డమ్ వంటి తన సన్నిహిత దేశాల సహాయంతో జైలులో పెట్టవచ్చని అమెరికా భావిస్తోంది. తన స్వేచ్ఛా ముఖాన్ని ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించడానికే వాడుకుంటోంది. (క్లిక్: రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే పెళ్లి
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వీరు వివాహం చేసుకోబోతున్నారని వికీలీక్స్ మీడియా బృందం తెలిపింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను, అసాంజే కోసం కిల్ట్ను డిజైన్ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం అసాంజే జైల్లో ఉన్న కారణంగా వాయిదా పడింది. చివరికి గవర్నర్, జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో జైలులోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్ హవర్స్ సమయంలో ఈ వేడుక జరగనుంది. వికీలీక్స్ ప్రకారం, వందలాది మంది అసాంజే మద్దతుదారులు ఈ కార్యక్రమానికి జైలు వెలుపల చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలు ఉన్నారు. రాయబార కార్యాలయంలో నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్‌ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. -
‘ఇలాగైతే అసాంజే జైలులోనే మరణిస్తారు’
లండన్ : వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ అసాంజే ఆరోగ్యం సరిగా లేదని, విచారణ పేరిట వేధింపులు కొనసాగితే బ్రిటిష్ జైలులోనే ఆయన మరణించవచ్చని 60 మందికి పైగా వైద్యులు బ్రిటన్ హోం సెక్రటరీకి రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. అసాంజేకు తక్షణమే శారీరక, మానసిక వైద్య చికిత్సలు అవసరమని తేల్చిచెప్పారు. గూఢచర్య ఆరోపణలపై అసాంజేను తమకు అప్పగించాలని బ్రిటన్ను అమెరికా కోరుతోంది. గూఢచర్యం చట్టం కింద అసాంజేపై ఆరోపణలు నిగ్గుతేలితే అమెరికన్ జైలులో ఆయన 175 ఏళ్లు మగ్గవలసి ఉంటుంది. అసాంజేను ఆరోగ్య కారణాలతో బెల్మార్ష్ జైలు నుంచి యూనివర్సిటీ టీచింగ్ ఆస్పత్రికి తరలించాలని హోం సెక్రటరీ ప్రీతిపటేల్, బ్రిటన్ దేశీయాంగ మంత్రికి రాసిన లేఖలో వైద్యులు కోరారు. లండన్‌లో అక్టోబర్ 21న కోర్టుకు హాజరైన సందర్భంగా అసాంజేను చూసినవారు వెల్లడించిన వివరాలతో పాటు ఆయన ఎదుర్కొంటున్న వేధింపులపై ఐరాస ప్రతినిధి నిల్స్ మెల్జర్ నివేదిక ఆధారంగా తాము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. అసాంజేపై విచారణ పేరుతో వేధింపులు కొనసాగితే ఆయన జీవితం అంతమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హక్కుల నిపుణులు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. 2010లో ఆప్ఘనిస్తాన్, ఇరాక్లలో అమెరికా దాడులకు సంబంధించిన సైనిక దౌత్య ఫైళ్లను అసాంజే వికీలీక్స్‌లో ప్రచురించడంతో అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
అసాంజేకు 50 వారాల జైలు శిక్ష
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు బుధవారం లండన్ న్యాయస్థానం 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలను ఆరోపించినందుకుగానూఈ శిక్షవిధిస్తూ సౌత్ వర్క్ క్రౌన్ కోర్డు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వికీలీక్స్ ఖండించింది. ఈ తీర్పుషాకింగ్, కుట్రపూరితమైందని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేపై గత ఏడేళ్లుగా బ్రిటన్ కోర్ట్‌లో స్వీడన్లో నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే ఈక్వడేరియన్లో తలదాచుకున్న అసాంజేకు ఎంబసీ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
‘వికీలీక్స్’ అసాంజె అరెస్ట్
లండన్: అమెరికా రక్షణ రహస్యాలు బహిర్గతం చేసి సంచలనం సృష్టించిన వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె(47) అరెస్టయ్యారు. ఏడేళ్లుగా ఆయన లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు . అసాంజెకు కల్పించిన శరణార్థి హోదా, పౌరసత్వాన్ని ఈక్వెడార్ తాజాగా ఉపసంహరించడంతో గురువారం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్‌చేశారు. తమ రహస్యాలను తస్కరించి ఘోరమైన నేరానికి పాల్పడిన అసాంజెను తమకు అప్పగించాలని అమెరికా పెట్టుకున్న విజ్ఞప్తి మేరకే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వెస్ట్‌మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా, అసాంజె తమ మందు గైర్హాజరై బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టు నిర్ధారించింది. దీంతో ఆయనకు 12 నెలల శిక్ష పడే అవకాశాలున్నాయి. ఈక్వెడార్ ఎంబసీలో ఆశ్రయం స్వీడన్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలపై అరెస్టయినప్పటి నుంచి అసాంజె ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో తనను స్వీడన్‌కు అప్పగిస్తే, చివరకు అమెరికాకు అప్పగిస్తారని, అదే జరిగితే తనకు మరణ దండన లేదా చిత్రహింసలు తప్పవని పేర్కొంటూ ఈక్వెడార్ సాయం అర్థించిన తెలిసిందే. కోర్టు ముందు లొంగిపోవడంలో విఫలమైన అసాంజెకు వ్యతిరేకంగా అదే కోర్టు 2012 జూన్ 29న ఆదేశాలిచ్చిందని, ఆ వారెంట్ ప్రకారమే ఆయన్ని అరెస్ట్ చేశామని మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించింది. అసాంజె అరెస్ట్‌ను యూకే ప్రభుత్వం స్వాగతించింది. యూకే, ఈక్వెడార్ల మధ్య జరిగిన విస్తృత చర్చల ఫలితంగానే ఇది సాధ్యమైందని పేర్కొంది. శరణార్థి నిబంధనలను అసాంజె తరచూ ఉల్లంఘించారని అందుకే ఆయనకు కల్పించిన రక్షణను ఉపసంహరించుకున్నామని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో చెప్పారు. ఇటీవలి కాలంలో అసాంజె, తన ఆతిథ్య దేశం ఈక్వెడార్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అసాంజె ఆశ్రయంపై పలు కొత్త నిబంధనలు విధించిన ఈక్వెడార్..ఆయన ఇంటర్నెట్ వినియోగం పైనా ఆంక్షలు పెట్టింది. రహస్యాలు బహిర్గతం చేసిన అసాంజెపై అభియోగాలు మోపినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు. కానీ కీలక పత్రాల ముద్రణకు సంబంధించి అసాంజెపై నేరపూరిత ఆరోపణలు నమోదైనట్లు గతేడాది బయటపడింది. అసాంజె కేసు నేపథ్యమిదీ అమెరికా దౌత్య విధానాలు, అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి వికీలీక్స్ 2010లో 7.20 లక్షల కీలక పత్రాలను బహిర్గతం చేసింది. అదే ఏడాది అసాంజెపై లైంగికదాడి ఆరోపణలు రావడంతో స్వీడన్ కోర్టు వారెంట్ జారీచేసింది. లండన్‌లో లొంగిపోయిన అసాంజె బెయిల్‌పై విడుదలయ్యారు. అసాంజెను స్వీడన్‌కు అప్పగించాలని 2011లో బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. అదే జరిగితే తనను స్వీడన్ నుంచి అమెరికాకు అప్పగిస్తారని ఈక్వెడార్ సాయం కోరారు అసాంజె. దీంతో 2012 జూన్‌లో ఆయనకు ఈక్వెడార్ రాజకీయ శరణార్థి హోదా ఇచ్చింది. లండన్‌లో అసాంజెను ప్రశ్నించేందుకు స్వీడన్ అధికారులకు ఈక్వెడార్ అనుమతివ్వలేదు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఈక్వెడార్ ఆయనపై పలు ఆంక్షలు విధించింది. -
వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే అరెస్ట్
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ పాల్ అసాంజేని అరెస్ట్ చేసినట్టు యూకే పోలీసులు ప్రకటించారు. తన లీక్స్‌తో ప్రపంచంలోని అవినీతిపరులను ముప్పుతిప్పలు పెట్టిన అసాంజే ఎట్టకేలకు బ్రిటన్ పోలీసులకు చిక్కాడు. ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న ఏడేళ్ల తరువాత అతనిని లండన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. త్వరలోనే వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు అసాంజేని అరెస్ట్ చేసేందుకు లండన్‌తో ఈక్వేడార్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటూ విక్సీలీక్స్ ఇటీవల ట్వీట్ చేసి సంచలనం రేపింది. ఈక్వేడార్ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల నుంచి తమకు ఈ సమాచారం అందినట్లు వికీలీక్స్ తెలిపింది. ఐఎన్ఏ పేపర్స్ లీక్ చేసి ఆఫ్‌షోర్ కుంభకోణం బయటపెట్టాడన్న కారణంతో ఈక్వేడార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అసాంజే అరెస్ట్‌పై స్పందించిన వికీలీక్స్ బ్రిటిష్ పోలీసులను ఆహ్వానించి మరీ ఆయన అదుపులోకి తీసుకున్నారని ట్వీట్ చేసింది. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో అరెస్టునుంచి తప్పించుకునేందుకు,స్వీడన్‌కు అప్పగించకుండా ఉండేందుకు 2012 నుంచి అసాంజే లండన్‌లోని ఈక్వేడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. URGENT Julian Assange did not "walk out of the embassy". The Ecuadorian ambassador invited British police into the embassy and he was immediately arrested. — WikiLeaks (@wikileaks) April 11, 2019 -
అసాంజేను బయటకు పంపనున్న ఈక్వెడార్
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను లండన్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి త్వరలో బయటకు పంపుతామని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో ప్రకటించారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అసాంజే(47) అమెరికాకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేశారనే ఆరోపణలున్నాయి. వీటిపై బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగించవచ్చనే భయంతో అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో 2012 నుంచి ఉంటున్నారు. ‘అసాంజే ఆశ్రయం పొందే హోదాను త్వరలో ఉపసంహరించుకుంటాం’ అని మొరెనో ప్రకటించారు. -
‘ఆమె ఇడియట్ కాదు.. నాకు చాలా ఇష్టం’
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ పమీలా ఆండర్సన్ అంటే తనకు చాలా ఇష్టం అని వికిలీక్స్ సంస్థ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే చెప్పారు. వారిద్దరి మధ్య ఏదో రోమాంటికల్ రిలేషన్ ఉందంటూ వస్తున్న ఊహగానాలకు అసాంజే ఈ విషయంతో మరింత స్పష్టతనిచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె ఇడియట్ కాదని, చాలా మంచిదని తెలిపారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో అసాంజే ఈ విషయాలు చెప్పినట్లు బ్రిటన్ పత్రిక ఒకటి తెలిపింది. తనది ఎంతో ఆకర్షణీయమైన, ఆకట్టుకోగల ఆహార్యం అంటూ కూడా అసాంజే అన్నట్లు ఆ పత్రిక వివరించింది. పమీలా చాలా బలమైన మనస్తత్వం కలిగిన వనిత. ఆమె ఏ మాత్రం ఇడియట్ కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. నేను ఆమెను చాలా ఇష్టపడతాను. ఆమె చాలా గొప్ప స్త్రీ కూడా. ఇంతకంటే ప్రైవేటు విషయాలు నేను చెప్పలేను. చాలా మంది ఆమె స్వేచ్ఛగా స్వతంత్ర్యంగా తిరుగుతుందని అంటుంటారు. కానీ, ఎవరి జీవితాన్ని వారే సజావుగా నడుపుకోవచ్చని చెప్పేందుకు ఆమె ఒక మోడల్ కూడా’ అని అసాంజే చెప్పారు. -
వికిలీక్స్ వ్యవస్థాపకుడికి ఇంటర్నెట్ కట్
-
అసాంజేకు స్వేచ్ఛనివ్వాలి: ఐరాస
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఐక్యరాజ్యసమితి విచారణ కమిటీ ఊరట కల్పించింది. ఆయనకు తక్షణం స్వేచ్ఛనివ్వాలని విచారణ కమిటీ బ్రిటన్, స్వీడన్లకు స్పష్టంచేసింది. ఐదేళ్ల నిర్బంధ జీవితం గడిపిన ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం తేల్చిచెప్పింది. జెనీవా కేంద్రంగా ఐదుగురు సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. అసాంజేపై స్వీడన్లో అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. బయటకు వస్తే పోలీసులు అరెస్టుచేసి స్వీడన్‌కు, తర్వాత అమెరికాకు అప్పగిస్తారన్నది అసాంజే భయం. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా అకృత్యాల రహస్య సమాచారాన్ని ఆయన వికీలీక్స్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. కమిటీ నిర్ణయాన్ని తాము పట్టించుకోబోమని బ్రిటన్, స్వీడన్లు స్పష్టంచేశాయి. తాను నిర్దోషిని అనడానికి ఈ తీర్పు నిదర్శనమని అసాంజే పేర్కొన్నారు. -
అస్సాంజేను విడుదల చేయాల్సిందే
ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా మిత్ర దేశాలతో కలసి సాగించిన కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేసిన వికీలీక్స్ అధినేత జూలియన్ అస్సాంజేకి అనుకూలంగా ఐక్యరాజ్యసమితి లీగల్ ప్యానెల్ శుక్రవారం తీర్పు చెప్పింది. ఏకపక్ష నిర్బంధం నుంచి ఆయన్ని విడుదల చేయాలని, ఆయన స్వేచ్ఛను హరించే హక్కు బ్రిటన్ ప్రభుత్వానికి లేదని, అలా చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ ప్యానెల్ అభిప్రాయపడింది. ఈ తీర్పునకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ దేశాల చట్టాల ప్రకారం తాము నడుచుకుంటామని, ఈక్వెడార్ ఎంబసీ కార్యాలయం నుంచి అస్సాంజే బయటకు రాగానే ఆయన్ని అరెస్టు చేస్తామని బ్రిటన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఐరాస లీగల్ ప్యానెల్ తీర్పు గురించి అధికారికంగా తమకు ఎలాంటి నివేదక ఇప్పటివరకు అందలేదని కూడా తెలిపింది. వాస్తవానికి నిర్బంధం నుంచి అస్సాంజేను విడుదల చేయాలని లీగల్ ప్యానెల్ రెండు రోజుల క్రితమే నిర్ణయించి, ఆ నిర్ణయాన్ని సంబంధిత దేశాలకు ఇప్పటికే తెలియజేసింది. తీర్పు ప్రతిని శుక్రవారం రాత్రి విడుదల చేస్తామని ప్రకటించింది. నాలుగేళ్లుగా అస్సాంజే.. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం తెల్సిందే. స్వీడన్ రేప్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అస్సాంజేని అరెస్టు చేసి, స్వీడన్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అప్పట్నుంచి ప్రయత్నిస్తోంది. ఏడాది క్రితం వరకు ఎంబసీ కార్యాలయం వద్ద బ్రిటన్ తమ పోలీసులతో 24 గంటలపాటు నిఘా పెట్టింది. ఆ తర్వాత ఎలాగూ దొంగదారిన తప్పించుకునే అవకాశం లేదని గ్రహించి నిఘాను తొలగించింది. ఈ అరెస్టును తప్పించుకునేందుకే ఆయన ఈక్వెడార్ ప్రభుత్వం శరణుగోరి ఎంబసీలో తలదాచుకుంటున్నారు. అస్సాంజే తనపై వచ్చిన రేప్ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు. స్వీడన్లో ఈ ఆరోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు అక్కడికి వెళ్తే.. అక్కడి ప్రభుత్వం తనను పట్టుకొని అమెరికాకు అప్పగిస్తుందన్నది అస్సాంజే భయం. అఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి అమెరికా చేసిన కుట్రలు, కుతంత్రాలు, గ్వాంటనామో జైలుకు సంబంధించిన భయంకర వాస్తవాలు, మిత్ర దేశాలతో జరిపిన రహస్య చర్చలకు సంబంధించి అస్సాంజే తన సంస్థ వికీలీక్స్ పేరిట దాదాపు కోటి ఫైళ్లను ప్రపంచానికి విడుదల చేశారు. ఆస్ట్రేలియాలో సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా జీవితాన్ని ప్రారంభించిన అస్సాంజే ఇప్పుడు ప్రపంచానికి సుపరిచితుడు. -
అసాంజేను లండన్‌లో ప్రశ్నించనున్నారు
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను త్వరలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. లండన్‌లోని ఓ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈక్వెడార్ విదేశాంగ అధికారులు తెలిపారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను ప్రశ్నించేందుకు 2010 నుంచి స్వీడన్ ప్రయత్నిస్తోంది. అయితే, ఆయన ప్రస్తుతం ఈక్వెడార్‌లోని లండన్ రాయబార కార్యాలయంలో గత మూడేళ్లుగా(2012నుంచి) రక్షణ పొందుతున్నారు. ఇటీవల స్వీడన్‌కు చెందిన ఓ న్యాయవాది అసాంజే వద్దకు వచ్చి ప్రశ్నించే విధానం, కొన్ని మినహాయింపులు చెప్పిన తర్వాత అసాంజే సమ్మతి తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్ అధికారులు స్వీడన్ తో పలు కోణాల్లో చర్చలు జరిపి ఆయనను లండన్ లో విచారించేందుకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. దీంతో త్వరలోనే అసాంజేను స్వీడన్ అధికారులు ప్రశ్నించనున్నారు.