అసాంజేను లండన్లో ప్రశ్నించనున్నారు | Julian Assange may face Swedish interrogation within days | Sakshi
Sakshi News home page

అసాంజేను లండన్లో ప్రశ్నించనున్నారు

Published Sat, Dec 12 2015 4:04 PM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

అసాంజేను లండన్లో ప్రశ్నించనున్నారు

అసాంజేను లండన్లో ప్రశ్నించనున్నారు

లండన్‌: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను త్వరలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. లండన్లోని ఓ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఈక్వెడార్ విదేశాంగ అధికారులు తెలిపారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను ప్రశ్నించేందుకు 2010 నుంచి స్వీడన్ ప్రయత్నిస్తోంది.

అయితే, ఆయన ప్రస్తుతం ఈక్వెడార్లోని లండన్ రాయబార కార్యాలయంలో గత మూడేళ్లుగా(2012నుంచి) రక్షణ పొందుతున్నారు. ఇటీవల స్వీడన్కు చెందిన ఓ న్యాయవాది అసాంజే వద్దకు వచ్చి ప్రశ్నించే విధానం, కొన్ని మినహాయింపులు చెప్పిన తర్వాత అసాంజే సమ్మతి తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈక్వెడార్ అధికారులు స్వీడన్ తో పలు కోణాల్లో చర్చలు జరిపి ఆయనను లండన్ లో విచారించేందుకు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. దీంతో త్వరలోనే అసాంజేను స్వీడన్ అధికారులు ప్రశ్నించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement