
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను లండన్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి త్వరలో బయటకు పంపుతామని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో ప్రకటించారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అసాంజే(47) అమెరికాకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేశారనే ఆరోపణలున్నాయి. వీటిపై బ్రిటన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగించవచ్చనే భయంతో అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో 2012 నుంచి ఉంటున్నారు. ‘అసాంజే ఆశ్రయం పొందే హోదాను త్వరలో ఉపసంహరించుకుంటాం’ అని మొరెనో ప్రకటించారు.