
Kristen Stewart And Dylan Meyer Are Engaged: ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవర్ట్ షాకింగ్ ప్రకటన చేశారు. సహనటి డైలాన్ మేయర్‌తో తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. రెండేళ్ల నుంచి తాము డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే వీరద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా ప్రకటనతో వీరి బంధం గురించి జనాలకు ఓ క్లారిటీ వచ్చింది.
సైరస్‌ఎక్స్‌ఎం ది హోవార్డ్ స్టెర్న్ షోకు గెస్ట్‌గా వచ్చిన క్రిస్టెన్ తన ఎంగేజ్‌మెంట్ వార్తను ప్రకటించారు. పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టెన్ మాట్లాడుతూ.. ‘‘అతి త్వరలో నేను, డైలాన్ వివాహం చేసుకోబోతున్నాం. మేం ఒకరి కోసం ఒకరం జీవించాలని కోరుకుంటున్నాం. నా కోసం తను.. డైలాన్ కోసం నేను.. మమ్మల్ని మార్చుకున్నాం. మేం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం’’ అని తెలిపారు.
(చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం)
ఇక క్రిస్టెన్, డైలాన్ 2019 నుంచి డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఇరువురు ఈ వార్తలపై స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టైల్ మ్యాగ్‌జైన్ ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టెన్ తనకు, డైలాన్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించారు. ‘‘నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి ప్రతిరోజు బయటకు వెళ్లేదాన్ని. తనతో ఆప్యాయంగా ఉన్న సమయంలో నన్ను ఫోటో తీయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. కానీ నేను వాటి గురించి పట్టించుకునేదాన్ని కాదు’’ అన్నారు.
‘‘నేను ఎంతో ఒత్తిడిని అనుభవించాను. కానీ ఈ ఒత్తిడి నన్ను నేను ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన దాన్ని అని ఫీల్ అయ్యేలా చేయలేదు. జనాలు నాకు సంబంధించిన ఫోటోలు చూస్తున్నారు.. వార్తలు చదువుతున్నారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి తమ గురించి ప్రకటించుకోగలుగుతున్నారు. ఈ విషయంలో చిన్నతనంలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నాలా బాధపడేవారికి ఉపశమనం కలిగించేందుకు నేను చేస్తున్న ప్రయత్నాలు నాకు తృప్తిని ఇస్తున్నాయి’’ అని తెలిపారు.
(చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో నటి రహస్య వివాహం!)
డైలాన్ మేయర్ ఒక నటి, రచయిత. ఆమె మోక్సీ, రాక్ బాటమ్, మిస్ 2059 వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందింది. క్రిస్టెన్ స్టెవర్ట్ తదుపరి స్పెన్సర్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె యువరాణి డయానాగా నటించనుంది. క్రిస్టెన్ స్టీవర్ట్ గతంలో సూపర్ మోడల్ స్టెల్లా మాక్స్‌వెల్, ట్విలైట్ సహనటుడు రాబర్ట్ ప్యాటిన్సన్‌లతో డేటింగ్ చేసింది.
చదవండి: ముచ్చటగా మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment