
లారా బెల్ బండీ
కరోనా ప్రభావం హాలీవుడ్ నటుల మీద బాగా కనిపిస్తోంది. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్, ‘జేమ్స్ బాండ్’ నటి ఓల్గా కురీలెన్కో ఆల్రెడీ కరోనా బారిన పడ్డారు. తాజాగా ’జుమాంజి’ నటి లారా బెల్ బండీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రకటించారు. ‘కరోనా పాజిటివ్ అని తెలిసినా భయపడటం లేదు. డాక్టర్స్ సూచనలను పాటిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటానని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు లారా బండీ.