South Korean Snowdrop Actress Kim Mi-soo Suspicious Death In Her Home - Sakshi
Sakshi News home page

Kim Mi Soo Death: ప్రముఖ ‘స్నోడ్రాప్‌’ నటి అనుమానాస్పద మృతి

Published Sat, Jan 8 2022 1:50 PM | Last Updated on Sat, Jan 8 2022 5:12 PM

South Korean Actress Kim Mi-soo Last Breath At Age 29 - Sakshi

Snowdrop Series Actress Kim Mi Soo Died At Age 29: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి కిమ్‌ మీ సూ(Kim Mi-soo) ఆకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. 29 ఏళ్ల కిమ్‌ మీ సూ సౌత్‌ కొరియాలోని తన ఇంటిలో బుధవారం అనూమానస్పదంగా కన్నుమూసినట్లు అక్కడ స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ‘స్నో డ్రాప్‌’ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు పొందిన కిమ్‌ సూ హఠ్మారణం అందరిని షాక్‌కు గురి చేస్తోంది.

చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా..

దీంతో ఆమె మృతికి కొరియన్‌ నటీనటులతో పాటు ప్రపంచ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా గతేడాది జనవరి 28న నటి సాంగ్‌ యూ జంగ్‌(26) మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కొరియన్‌కు చెందిన చాలా మంది సినీ తారలు 30 ఏళ్లలోపే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతి చెందిన అక్కడ నటీనటులలో చాలా మంది 30 ఏళ్ల లోపువారే ఉండటం గమనార్హం.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement