
ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే తీవ్ర గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసింది.
Priyanka Chopra Co-Star Anne Heche Critically Injured In Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే తీవ్ర గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటిని ఢీ కొట్టగా, కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే ఆమెకు కాలిన గాయాలయ్యాయని లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి బ్రియాన్ హంఫ్రీ ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు.
ఆమె కారు క్రాష్‌కు గురైనప్పుడు స్థానికులు అక్కడ ఉండటం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అన్నే హెచే పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. స్ట్రేచర్‌పై ఉన్న అన్నే స్పృహలోకి వచ్చినట్లు, శ్వాస తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా అన్నే హెచే అనెదర్ వరల్డ్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటితోపాటు డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది.
చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్
బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే!