షూటింగ్‌లో గాయపడ్డ స్టార్‌ హీరోయిన్‌ | Priyanka Chopra Gets Injured On The Sets Of 'The Bluff' | Sakshi
Sakshi News home page

Priyanka Chopra: షూటింగ్‌లో గాయపడ్డ స్టార్‌ హీరోయిన్‌..ఫోటో వైరల్‌

Published Wed, Jun 19 2024 4:26 PM | Last Updated on Wed, Jun 19 2024 4:52 PM

Priyanka Chopra Get Injured On The Sets Of Bluff

సినిమా షూటింగ్‌లో స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా  గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్‌ మూవీ ది బ్లఫ్​ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్‌ అయిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ..‘వృత్తి జీవితంలో ప్రమాదాలు’ అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ‘స్టంట్’‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

(చదవండి: అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!)

‘ది బ్లఫ్’లో ప్రియాంక చోప్రా యాక్షన్‌ రోల్‌ ప్లే చేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని యాక్షన్స్‌ సీన్స్‌ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్‌లో ప్రమాదాలు జరగడం ప్రియాంకకు కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల షూటింగ్‌ సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు పెదవి చివర చిన్న గాయంతో పాటు మెడపై గాటు పడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘జాగ్రత్త’ మేడం అంటూ అమె అభిమానులు  కామెంట్‌ చేస్తున్నారు.

(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్‌)

సినిమాల విషయాలకొస్తే..  ఒకప్పుడు  బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగిన ప్రియాంకా చోప్రా..  2018లో అమెరికా సింగర్‌ నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్‌కి మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. చివరగా సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement