Quantico TV Show
-
కారు ప్రమాదం.. ప్రముఖ నటికి తీవ్ర గాయాలు
Priyanka Chopra Co-Star Anne Heche Critically Injured In Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే తీవ్ర గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటిని ఢీ కొట్టగా, కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే ఆమెకు కాలిన గాయాలయ్యాయని లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతినిధి బ్రియాన్ హంఫ్రీ ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు. ఆమె కారు క్రాష్‌కు గురైనప్పుడు స్థానికులు అక్కడ ఉండటం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అన్నే హెచే పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. స్ట్రేచర్‌పై ఉన్న అన్నే స్పృహలోకి వచ్చినట్లు, శ్వాస తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా అన్నే హెచే అనెదర్ వరల్డ్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటితోపాటు డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్ బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే! -
క్షమించండి
అమెరికన్ ‘క్వాంటికో’ సిరీస్‌లో పాల్గొన్న తర్వాత ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్ స్టార్డమ్ మరింత పెరిగింది. కానీ క్వాంటికో థర్డ్ సీజన్ ప్రియాంకకు అంతగా కలిసి రానట్లు ఉంది. ఆల్రెడీ ఈ షోకు ప్రేక్షకాదరణ ఆశించిన స్థాయిలో లేకపోగా, ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన ‘బ్లడ్ ఆఫ్ రోమియో’ ఎపిసోడ్లో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రియాంకా చోప్రా నటించారన్నది అభియోగం. ఈ వివాదంపై ఆమె స్పందించి క్షమాపణలు చెప్పారు. ‘‘క్వాంటికో సిరీస్ రీసెంట్ ఎపిసోడ్లో నా యాక్టింగ్ కొందరి మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. అది ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. నేను ఇండియన్ అయినందుకు గర్వపడుతున్నాను. ఇందులో ఎప్పటికీ ఏ మార్పు ఉండదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రియాంకా తండ్రి అశోక్ చోప్రా చనిపోయి ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ సందర్భంగా తండ్రితో గడిపిన మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
షాట్ గ్యాప్‌లో స్మాల్ టచ్!
ఫేస్‌కి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ చేసుకోవడం ఓ ఆర్ట్. హీరోయిన్లకైతే ఈ విషయంలో చాలా ఇబ్బందే. ఎందుకంటే, సీన్‌కో హెయిర్ స్టైల్లో కనిపిస్తారు. ఒకవేళ ఆ స్టైల్ సూట్ కాకపోతే ఉన్న అందం కాస్తా పోతుంది. లక్కీగా కొంతమంది హీరోయిన్లకు అన్ని రకాల స్టైల్స్ నప్పుతాయి. ఆ లిస్ట్‌లో హాట్ గాళ్ ప్రియాంకా చోప్రా ఒకరు. ఈవిడగారికి బిగుతుగా జడ వేసినా బాగుంటుంది. లూస్ హెయిర్, బాబ్ కట్.. ఇలా ఏదైనా సూపర్. ఇప్పుడు ప్రియాంక కొత్త స్టైల్ ఏంటంటే.. ‘షార్ట్ హెయిర్’. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో థర్డ్ పార్ట్‌లో అలెక్స్ పారిస్ అనే పాత్రలో చేస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె జుత్తును కత్తిరించుకున్నారు. షూటింగ్ స్పాట్లో కాస్త గ్యాప్ దొరికితే చాలు హెయిర్ సరిచేసుకుంటూ.. బాగున్నానా? అన్నట్లు ఫేస్‌ను మిర్రర్లో చూసుకుంటున్నారట. పక్కన ఉన్న ఫొటోలో చుశారుగా! ప్రియాంక తన జుత్తును ఎలా సరిచేసుకుంటున్నారో? ‘‘కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. సరిగా ఉందో లేదోనని హెయిర్‌ని టచ్ చేయకుండా ఉండలేకపోతున్నాను’’ అంటున్నారు ప్రియాంక. -
రవిని మిస్సవుతున్నా!
రాత్రి చంద్రుణ్ణి చూడటం తప్ప డే టైమ్‌లో ప్రియాంకా చోప్రా రవిని చూడటంలేదట. అదేనండీ.. సూర్యుణ్ణి. ఎందుకలా అనుకుంటున్నారా? మరేం లేదు. రాత్రంతా షూటింగ్ చేసి, పగలంతా నిద్రపోతున్నారు. అది కూడా ఇక్కడ కాదు. దేశం కాని దేశంలో. న్యూయార్క్‌లో. అది కూడా సినిమా షూటింగ్ కాదు.. టీవీ సిరీస్ షూట్ కోసం. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా హాలీవుడ్‌కి వారికి పరిచయమయ్యారు ప్రియాంక. రెండు సిరీస్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. మూడో సిరీస్ ముచ్చటగా ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ థర్డ్ సిరీస్‌లో ప్రియాంకా చోప్రా పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నారు. అందుకోసం హెయిర్‌ని షార్ట్‌గా కట్ చేసుకుని కంప్లీట్‌గా న్యూ లుక్‌లోకి మారారు ప్రియాంక. ‘‘నైట్ షూట్ చేస్తున్నాం. సూర్యుడు ఉదయించక ముందే షూటింగ్ పూర్తవుతోంది. ఆ తర్వాత ఇంటికెళ్లడం.. కునుకు తీయడం. ఇదేం నాకు కొత్త కాదు. హిందీ సినిమాలకు బోలెడన్ని నైట్ షూట్స్ చేశాను’’ అని పేర్కొన్నారు ప్రియాంక. -
అమెరికాలో ఒకటి గుడ్...మరొకటి బ్యాడ్!
దేశీ తార ప్రియాంకా చోప్రా అమెరికాన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా విదేశాల్లో బాగా పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’లో నటిస్తున్నారామె. ఈ షూటింగ్ కోసం అమెరికాలో ఎక్కువగా ఉంటున్నారు ప్రియాంక. అక్కడి టాక్ షోస్‌లో కూడా పాల్గొంటున్నారు. ఎలెన్ డిజినిరస్ నిర్వహించిన ఓ టాక్ షోలోనూ, చెల్సీ హ్యాండలర్స్ నిర్వహించిన మరో టాక్ షోలోనూ పాల్గొన్నారు. ఎలన్ నిర్వహించిన షోలో ప్రియాంక మాటలు చాలామందిని ఆగ్రహానికి గురి చేశాయి. చెల్సీ షోలో మాట్లాడిన మాటలు అభినందనలు తెచ్చిపెట్టాయి. ఆ విధంగా ఒక షో గుడ్.. మరో షో బ్యాడ్ నేమ్ తెచ్చింది. షో ఆరంభంలో ఎలెన్ డిజినిరస్ కూల్‌గా ప్రియాంకకు ‘టకీలా’ (మద్యపానం) ఆఫర్ చేసి, ‘మా అమెరికన్లు ఎక్కువ తాగుతారు’ అన్నారు. ప్రియాంక టకీలా లాగించి, ‘మా ఇండియన్స్ కూడా చాలా తాగుతారు’ అన్నారు. దేశం కాని దేశంలో ఇండియా గురించి ప్రియాంక అలా కామెంట్ చేయడం చాలామందిని ఆగ్రహానికి గురి చేసింది. ఈ షోలో ప్రియాంక ఓవర్ యాక్షన్ చేశారనీ, అదంతా టకీలా ప్రభావమేనని ఆమెను నిందిస్తున్నారు. ఇక.. చెల్సీ హ్యాండలర్స్ షోలో ప్రియాంక మాట్లాడిన మాటలు బ్రహ్మాండం అంటున్నారు. ‘వీకెండ్స్‌లో మీరెక్కువగా ఇండియాలో షూటింగ్ చేయడానికి కారణం?’ అని చెల్సీ అడిగితే - ‘‘వాస్తవానికి అమెరికా వచ్చి నేను చెడిపోయా. మీకులా మాకు వీకెండ్స్ ఉండవు. ఏడు రోజులూ పని చేస్తాం. కానీ, అమెరికాలో వారంలో రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. నేనైతే మొదట్లో ఆశ్చర్యపోయా. ఆ రెండు రోజులూ వేస్ట్ చేయడకుండా ఇండియా వెళ్లి, షూటింగ్ చేస్తున్నా’’ అన్నారు ప్రియాంక. అమెరికా రాకముందే మీకు ఇంగ్లిష్ వచ్చా? అని చెల్సీ అడిగితే - ‘‘బాగా వచ్చు. నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లిష్. మీకో విషయం చెప్పనా? మా ఇండియన్ జనాభా సంఖ్య దాదాపు 130 కోట్లు. సుమారు పది శాతం మంది ఇంగ్లిష్ మాట్లాడతారు. ఆంగ్ల మాతృభాష కాని మిగతా దేశాలతో పోల్చితే మా దేశంలోనే ఎక్కువగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నాం. మీరు ఇండియా వస్తే.. ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లతో ఎన్కౌంటర్ చేయొచ్చు’’ అన్నారు. ఈ షోలో ప్రియాంక చెప్పిన సమాధానాలు చాలా బాగున్నాయి. మంచితో పాటు చెడు.. చెడుతో పాటు మంచి ఉంటుందంటారు. అలా.. ఒక షోతో మంచి.. మరో షోతో ప్రియాంక చెడు అనిపించుకున్నారు. -
సూపర్ హీరోయిన్
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతూనే, ‘క్వాంటికో’ టీవీ షోతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోయారు ప్రియాంకా చోప్రా. ఆ టీవీ సీరియల్‌తో పాటు తాజాగా ఓ అమెరికా రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం దక్కించుకున్న ప్రియాంకను మరిన్ని క్రేజీ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.‘గేమ్’, ‘ఢిల్లీ బెల్లి’ చిత్రాల దర్శకుడు అభినయ్ దేవో ఓ సూపర్ హీరో తరహా పాత్రలో ఫిమేల్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ప్రియాంకతో ఈ సినిమా గురించి డిస్కస్ చేశారట. కానీ ‘క్వాంటికో’ షూటింగ్ అయ్యే వరకూ ఏ సినిమా ఒప్పుకోరని సన్నిహిత వర్గాల సమాచారం. అప్పటివరకూ వెయిట్ చేసి ప్రియాంక తోనే సినిమా చేయాలని అభినయ్ ఆశ.