
రాత్రి చంద్రుణ్ణి చూడటం తప్ప డే టైమ్‌లో ప్రియాంకా చోప్రా రవిని చూడటంలేదట. అదేనండీ.. సూర్యుణ్ణి. ఎందుకలా అనుకుంటున్నారా? మరేం లేదు. రాత్రంతా షూటింగ్ చేసి, పగలంతా నిద్రపోతున్నారు. అది కూడా ఇక్కడ కాదు. దేశం కాని దేశంలో. న్యూయార్క్‌లో. అది కూడా సినిమా షూటింగ్ కాదు.. టీవీ సిరీస్ షూట్ కోసం. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా హాలీవుడ్‌కి వారికి పరిచయమయ్యారు ప్రియాంక. రెండు సిరీస్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి.
మూడో సిరీస్ ముచ్చటగా ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ థర్డ్ సిరీస్‌లో ప్రియాంకా చోప్రా పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నారు. అందుకోసం హెయిర్‌ని షార్ట్‌గా కట్ చేసుకుని కంప్లీట్‌గా న్యూ లుక్‌లోకి మారారు ప్రియాంక. ‘‘నైట్ షూట్ చేస్తున్నాం. సూర్యుడు ఉదయించక ముందే షూటింగ్ పూర్తవుతోంది. ఆ తర్వాత ఇంటికెళ్లడం.. కునుకు తీయడం. ఇదేం నాకు కొత్త కాదు. హిందీ సినిమాలకు బోలెడన్ని నైట్ షూట్స్ చేశాను’’ అని పేర్కొన్నారు ప్రియాంక.
Comments
Please login to add a commentAdd a comment