
శివమొగ్గ: కారు అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న సుమారు 20 అడుగుల లోతైన గుంతలోకి పల్టీ కొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గాయపడ్డారు. హోసనగర తాలూకాలోని నిట్టూరు వద్ద ఈ ఘటన జరిగింది. బెంగళూరు శ్రీనగర లేఔట్‌కు చెందిన కుటుంబం కారులో సిగందూరుకు వెళుతున్న సమయంలో అతి వేగం వల్ల ప్రమాదం జరిగింది. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.
బెంగళూరువాసి ఆత్మహత్య
శివమొగ్గలోని ఒక లాడ్జితో బెంగళూరు రాజాజినగరకు చెందిన నరేంద్రబాబు (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చి లాడ్జ్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం గది నుంచి దుర్వాసన వస్తుండటంతో సిబ్బంది కోటె పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా బ్లేడుతో చేతులు కోసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడైంది. కేసు నమోదు చేశారు.
(చదవండి: విజయ్ బాబు షాకింగ్ నిర్ణయం, కమిటి నుంచి తొలగింపు)
Comments
Please login to add a commentAdd a comment