కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాలీవుడ్ నటి రాక్వెల్ వెల్చ్ (82) తుది శ్వాస విడిచారు. అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్ చికాగోలో 1940 సెప్టెంబర్ 5న రాక్వెల్ వెల్చ్ జన్మించారు. ఆమె అసలు పేరు జో రాక్వెల్ టెజేడా. హైస్కూల్ చదువుతున్న రోజుల్లో ‘ఫెయిరెస్ట్ ఆఫ్ ద ఫెయిర్’గా పేరు పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, స్టేట్ కాలేజ్‌లో థియేటర్ ఆర్ట్స్‌లో చేరారు రాక్వెల్. ‘ఎ హౌస్ ఈజ్ నాట్ ఎ హోమ్’ (1964)లో చేసిన చిన్నపా త్ర ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు.
1966లో వచ్చిన ‘ఫెంటాస్టిక్ వాయేజ్’లో ఓ లీడ్ రోల్ చేసిన రాక్వెల్‌కు మంచి గుర్తింపు లభించింది. 1973లో ‘ద త్రీ మస్కటీర్స్’కి ఆమెకు ఉత్తమ నటిగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది. 1995లో ‘ది ఎంపైర్’ మ్యాగజీన్ ప్రచురించిన ‘100 సెక్సియస్ట్ స్టార్స్ ఆఫ్ ట్వంటీయత్ సెంచురీ’లో ఒకరిగా, మరో మ్యాగజీన్ ‘ప్లే బాయ్’ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచారామె. రాక్వెల్ చివరి చిత్రం ‘హౌ టు బి ఏ లాటిన్ లవర్’ (2017). ఇక 1959లో జేమ్స్ వెల్చ్ ను పెళ్లాడారామె. వీరికి ఇద్దరు సంతానం. వెల్చ్ నుంచి విడిపోయాక దాదాపు మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆయన ‘ఇంటి పేరు’తోనే కొనసాగారామె.
Comments
Please login to add a commentAdd a comment