
ఓల్గా కురిలెంకో
గత వారం హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య, నటి రీటా విల్సన్‌లు చేయించుకున్న పరీక్షల్లో కరోనా సోకిందని తేలింది. ఇప్పుడు మరో హాలీవుడ్ తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఓల్గానే తెలిపారు. ‘‘వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. జ్వరం, అలసట కరోనా ప్రధాన లక్షణాలు. ఏముందిలే అనుకోకుండా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
ప్రస్తుతం నేను కరోనా కారణంగా గృహనిర్భందంలో ఉన్నాను. చికిత్స చేయించుకుంటున్నాను’’ అని ఓల్గా పేర్కొన్నారు. 2008లో వచ్చిన ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, 2013లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఒబ్లివిన్’లో ఓల్గా నటన ఆకట్టుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఎంపైర్స్ ఆఫ్ ది డీప్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కాల్పనిక కథతో రూపొందిన యాక్షన్ అడ్వంచరెస్ మూవీ. ఇది కాకుండా ఓల్గా నటించిన ‘ది బే ఆఫ్ సైలెన్స్’ అనే థ్రిల్లర్ మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment