Olga Kurylenko
-
కరోనానుంచి కోలుకున్న హీరోయిన్
జేమ్స్‌బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకో కరోనా వైరస్ బారినుంచి బయటపడ్డారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకున్నారు. సోమవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓల్గా స్పందిస్తూ తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. కుమారుడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘ నేను పూర్తిగా కోలుకున్నాను. మొదటి వారం రోజులు చాలా కష్టంగా గడిచింది. విపరీతమైన జ్వరం, తలనొప్పితో బాధపడ్డాను. రెండో వారంలో జ్వరం తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు ప్రారంభమైంది! చాలా అలసిపోయినట్లు ఉండేది. రెండో వారం చివర్లో ఆరోగ్యం కుదుట పడింది. దగ్గు తగ్గినప్పటికి ఉదయాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టేది. కానీ, ఈ రోజు అది కూడా లేదు. ( హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు! ) ఇప్పుడు నా కుమారుడితో కలిసి సమయాన్ని గడుపుతున్నా’నని పేర్కొన్నారు. కాగా, కొద్దివారాల క్రితం ఓల్గాకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈమె 2008లో వచ్చిన జేమ్స్‌బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. View this post on Instagram Happy Mother’s Day! #mothersday P.S. I have completely recovered 🙏 To recapitulate: For one week I felt pretty bad and was mostly in bed, sleeping, with high fever and strong headache. The second week, the fever was gone but some light cough appeared and I felt very tired. By the end of the second week I felt totally fine. Cough is almost gone although I still cough in the mornings but then it completely goes away for the day! I’m fine! And now I’m just enjoying this time to reflect on many things and spend my time with my son. 🙏 Я думаю я полностью выздоровела. Коротко о течении болезни: В первую неделю мне было очень плохо и я почти все время лежала с высокой температурой и много спала. Я спала 12 часов за ночь и потом ещё часа 3-4 днём!!! Подняться было тяжело. Усталость сумасшедшая. Головная боль дикая. Во вторую неделю температура полностью ушла и появился легкий кашель. Усталость осталась. Теперь практически никаких симптомов нет. Только немного кашель есть по утрам, но потом он полностью уходит на весь день. Теперь я наслаждаюсь отдыхом и провожу время с сыном. Держитесь!!! 💪 #coronavirus #коронавирус A post shared by Olga Kurylenko (@olgakurylenkoofficial) on Mar 22, 2020 at 2:13pm PDT -
కరోనాతో ఫైట్ చేయగలం
‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’ (2008), ‘ఒబ్లివిన్’ (2013) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి ఓల్గా కురిలెంకో. దాదాపు ఐదురోజుల క్రితం ఈ హాలీవుడ్ తార కోవిడ్ 19 (కరోనా వైరస్) బారిన పడ్డట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్యం కాస్త బాగానే ఉందనే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు ఓల్గా. ‘‘కాస్త బెటర్‌గా ఫీల్ అవుతున్నాను. నా జ్వరం పోయింది. నేను ఎక్కడ ఉన్నానా? అని కొందరు ఆలోచిస్తుండొచ్చు. ప్రస్తుతం నేను లండన్‌లో ఉన్నాను. కరోనా వైరస్ బారిన పడ్డానని టెస్ట్ చేయించుకున్నాక తెలిసింది. డాక్టర్లు చెప్పిన మందులతో పాటు వారి సలహా మేరకు విటమిన్స్, కొన్ని సప్లిమెంట్స్ (మెడిసిన్స్, హెల్దీపుడ్) తీసుకున్నాను. కరోనా వైరస్‌ను విటమిన్స్ నిర్మూలిస్తాయని నేను చెప్పడం లేదు. కానీ మనలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డాక్టర్ల సూచనలు పాటించడంతో పాటు మన జాగ్రత్తల్లో మనం ఉంటే కరోనాతో ఫైట్ చేయగలం’’ అని పేర్కొన్నారు ఓల్గా. ఆమె నటించిన ‘ఎంఫైర్స్ ఆఫ్ ది డీప్, ది బే ఆఫ్ సైలెన్స్’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. -
హీరోయిన్‌కు కరోనా.. ప్రియుడు బ్రేకప్!
ప్రపంచాన్ని గజగజవణికిస్తోన్న కరోనా వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు, పార్క్‌లు, సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక సెలబ్రిటీలు కూడా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ చెప్పి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. ఇంత జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో జేమ్స్ బాండ్ నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పాజిటివ్ అని తేలిన తర్వాత తనకు డాక్టర్లు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని ఆమె తెలిపింది. ఓల్గాకు కరోనా సోకడంతో ఆమె స్వయంగా తన అనుభవాన్ని చెప్తూ ప్రజలకు, అభిమానులకు పలు సూచనలు ఇస్తోంది. అలాగే తాను ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నానని.. కానీ కరోనా వైరస్‌ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలని ఓల్గా చెప్పుకొచ్చింది. విటమిన్ బీ5, విటమిన్-ఈ, విటమిన్-సీ, జింక్ కరోనా నియంత్రణకు ఎంతగానో సహకరిస్తాయని.. ఇవి వాడిన తర్వాతే తనకు జ్వరం కూడా తగ్గిందని ఓల్గా చెప్పింది. కాగా ఆమె కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని చూసి అందరూ అభినందిస్తున్నారు. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా ఆమెకు బ్రేకప్ చెప్పేసాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. చదవండి: కరోనా బారిన పడ్డాను Hello everyone! I’m feeling better today. My fever is gone! I hear people can’t figure out where I currently am. I’m in London... Head over to my Instagram for full post and updates - https://t.co/j1ICouSFxb pic.twitter.com/pxe1ih4l6Z — Olga Kurylenko (@OlyaKurylenko) March 18, 2020 -
కరోనా బారిన పడ్డాను
గత వారం హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య, నటి రీటా విల్సన్‌లు చేయించుకున్న పరీక్షల్లో కరోనా సోకిందని తేలింది. ఇప్పుడు మరో హాలీవుడ్ తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఓల్గానే తెలిపారు. ‘‘వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. జ్వరం, అలసట కరోనా ప్రధాన లక్షణాలు. ఏముందిలే అనుకోకుండా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రస్తుతం నేను కరోనా కారణంగా గృహనిర్భందంలో ఉన్నాను. చికిత్స చేయించుకుంటున్నాను’’ అని ఓల్గా పేర్కొన్నారు. 2008లో వచ్చిన ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, 2013లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఒబ్లివిన్’లో ఓల్గా నటన ఆకట్టుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఎంపైర్స్ ఆఫ్ ది డీప్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కాల్పనిక కథతో రూపొందిన యాక్షన్ అడ్వంచరెస్ మూవీ. ఇది కాకుండా ఓల్గా నటించిన ‘ది బే ఆఫ్ సైలెన్స్’ అనే థ్రిల్లర్ మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది.