
ఓల్గా కురెలెంకో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన చిత్రం
జేమ్స్‌బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకో కరోనా వైరస్ బారినుంచి బయటపడ్డారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకున్నారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓల్గా స్పందిస్తూ తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. కుమారుడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘ నేను పూర్తిగా కోలుకున్నాను. మొదటి వారం రోజులు చాలా కష్టంగా గడిచింది. విపరీతమైన జ్వరం, తలనొప్పితో బాధపడ్డాను. రెండో వారంలో జ్వరం తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు ప్రారంభమైంది! చాలా అలసిపోయినట్లు ఉండేది. రెండో వారం చివర్లో ఆరోగ్యం కుదుట పడింది. దగ్గు తగ్గినప్పటికి ఉదయాల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టేది. కానీ, ఈ రోజు అది కూడా లేదు. ( హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్ చెప్పిన ప్రియుడు! )
ఇప్పుడు నా కుమారుడితో కలిసి సమయాన్ని గడుపుతున్నా’నని పేర్కొన్నారు. కాగా, కొద్దివారాల క్రితం ఓల్గాకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈమె 2008లో వచ్చిన జేమ్స్‌బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్‌లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment