![Hollywood Actress Brooke Shields alleges rape in new documentary - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/21/WhatsApp%20Image%202023-01-21%20at%2015.41.22.jpeg.webp?itok=umzQ4MJu)
హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్. ఆమె పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల విడుదలైన కొత్త డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ'లో ఆమెపై జరిగిన లైంగిక దాడి సంఘటనను వివరించారు. అయితే నటిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఆమె ఆ వ్యక్తిని అంతకుముందే కలిసినట్లు చెప్పింది. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు తెలిసిన వ్యక్తేనని వివరించింది. చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన బ్రూక్ షీల్డ్స్ ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో చదివారు.
బ్రూక్ షీల్డ్స్‌కు తెలిసిన వ్యక్తి టాక్సీ పిలుస్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత బాత్రూమ్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడని ఆమె చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించింది.
బ్రూక్ షీల్డ్ మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నేను అతనిపై ఫైట్ చేయలేకపోయా. పూర్తిగా స్తంభించిపోయా. కేవలం 'నో' అని మాత్రమే అరిచా. ఆ సమయంలో కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నా.' అని వివరించింది. ఈ సంఘటన తర్వాత తన స్నేహితుడు, సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్‌కు ఫోన్ చేసినట్లు గుర్తుచేసుకుంది. కాగా.. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించబడిన కొత్త డాక్యుమెంటరీ "ప్రెట్టీ బేబీ'ని ప్రదర్శించారు.
.
Comments
Please login to add a commentAdd a comment