Brooke Shields
-
తెలిసిన వ్యక్తే అని వెెళ్తే.. లైంగిక దాడి చేశాడు: నటి
హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్. ఆమె పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల విడుదలైన కొత్త డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ'లో ఆమెపై జరిగిన లైంగిక దాడి సంఘటనను వివరించారు. అయితే నటిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఆమె ఆ వ్యక్తిని అంతకుముందే కలిసినట్లు చెప్పింది. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు తెలిసిన వ్యక్తేనని వివరించింది. చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన బ్రూక్ షీల్డ్స్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చదివారు. బ్రూక్ షీల్డ్స్‌కు తెలిసిన వ్యక్తి టాక్సీ పిలుస్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత బాత్రూమ్కు వెళ్లి అదృశ్యమయ్యాడని ఆమె చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించింది. బ్రూక్ షీల్డ్ మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నేను అతనిపై ఫైట్ చేయలేకపోయా. పూర్తిగా స్తంభించిపోయా. కేవలం 'నో' అని మాత్రమే అరిచా. ఆ సమయంలో కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నా.' అని వివరించింది. ఈ సంఘటన తర్వాత తన స్నేహితుడు, సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్‌కు ఫోన్ చేసినట్లు గుర్తుచేసుకుంది. కాగా.. సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించబడిన కొత్త డాక్యుమెంటరీ "ప్రెట్టీ బేబీ'ని ప్రదర్శించారు. . -
డేట్‌కి రావాలని ట్రంప్ ప్రపోజ్ చేశాడు..!
లాస్ఏంజెలిస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తనకూ ప్రపోజ్ చేశాడని ప్రముఖ హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ వెల్లడించారు. అయితే, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానన్నారు. రెండో భార్య మార్లా మేపుల్స్‌తో విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్ తనకు ఫోన్ చేశాడని, అప్పుడు తాను ఒక సినిమా షూటింగ్లో ఉన్నానని తెలిపారు. ‘ రెండో భార్య నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్ నాకు ఫోన్ చేశాడు. నువ్వు అమెరికన్ల హృదయసామ్రాజ్ఞివి.. నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుడిని.. మనిద్దరం కలిస్తే అందరికీ సంతోషం అంటూ డేట్‌కి రావాలని ప్రపోజ్ చేశాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించాను’ అని బ్రూక్ తాజాగా వెల్లడించారు. ట్రంప్‌ను తిరస్కరించిన హాలీవుడ్ తారల జాబితాలో సల్మా హయక్, కేండిస్ బెర్జెన్, ఎమ్మా థాంప్సన్‌ల సరసన తాజాగా బ్రూక్ షీల్డ్స్ కూడా చేరారు. -
హ్యాపీ బర్త్ డే- 31-05-15
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: భానుచందర్ (నటుడు), బ్రూక్ షీల్డ్స్(హాలీవుడ్ నటి) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 8. ఈ సంవత్సరం వీరికి అత్యంత ప్రభావవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఎంతోకాలంగా పరిశ్రమలు స్థాపించాలను కుంటున్న వారి కల నెరవేరుతుంది. నష్టాల్లో ఉన్న సంస్థలు లాభాల బాట పడతాయి. అయితే రాహుప్రభావం వల్ల కొన్ని గుర్తు తెలియని అనారోగ్యాలు పీడించవచ్చు. ఎం.బి.ఎ, ఎంసిఎ చేయాలనుకుంటున్న వారి కోరిక తీరుతుంది. లీగల్ సర్వీసులలో ఉన్న వారికి మంచి పేరుతోబాటు ఆదాయం కూడా లభిస్తుంది. అయితే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోకూడదన్నట్లు... వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం అవసరం. లేదంటే చాలా సమయం, డబ్బు వృథా అవుతాయి. లక్కీ నంబర్స్: 4,5,6,8; లక్కీ కలర్స్: వయొలెట్, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. అనాథలకు అన్నదానం, ఆవులకు, నల్లకుక్కలకు ఆహారం తినిపించాలి. శనికి తైలాభిషేకం, శివుడికి అభిషేకం జరిపించాలి. - డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు -
బ్రూక్ షీల్డ్స్‌ను చలినుంచి కాపాడిన విక్రం యోగా
చలికాలంలో ఆరోగ్యంగా, వెచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? విదేశాల్లో అయితే హాయిగా మందు కొడతారని అనుకుంటున్నారు కదూ. కానీ హాలీవుడ్ హీరోయిన్ బ్రూక్ షీల్డ్స్ మాత్రం అలా చేయట్లేదు. ప్రముఖ యోగా గురువు విక్రం చౌధురి రూపొందించిన విక్రం యోగా చేస్తోంది. దీనికే హాట్ యోగా అని కూడా పేరుంది. దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న గదిలో ఈ యోగాను ప్రాక్టీసు చేస్తారు. బాగా చలిగా ఉన్నప్పుడు శరీరాన్ని వెచ్చబరుచుకోడానికి ఇది బాగా ఉపయోగపడుతుందట. 48 ఏళ్ల బ్రూక్ షీల్డ్స్ కూడా న్యూయార్క్ నగరంలో బాగా చలిగా ఉండటంతో ఈ క్లాసులకు వెళ్తూ కనిపించినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. నగరంలో బాగా మంచు ఎక్కువ పడుతుండటంతో మఫ్లర్లు, కోట్లు అన్నీ చుట్టుకుని మరీ బ్రూక్ షీల్డ్స్ ఈ క్లాసులకు వెళ్తోంది. బాగీ గ్రే జాగింగ్ బాటమ్స్ ధరించి సరిగ్గా యోగా క్లాసులకు ఎలా వెళ్లాలో అలాగే వెళ్లిందట. మేకప్ ఏమాత్రం వేసుకోకుండా, ఒక చాప కూడా తీసుకుని వెళ్లిందని అక్కడి పత్రికలు పేర్కొన్నాయి.