డేట్‌కి రావాలని ట్రంప్‌ ప్రపోజ్‌ చేశాడు..! | Brooke Shields Reveals The Awkward Pickup Line Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నాకూ ప్రపోజ్‌ చేశాడు: బ్రూక్‌షీల్డ్స్‌

Published Thu, Oct 5 2017 4:00 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Brooke Shields Reveals The Awkward Pickup Line Donald Trump  - Sakshi

లాస్‌ఏంజెలిస్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో తనకూ ప్రపోజ్‌ చేశాడని ప్రముఖ హాలీవుడ్‌ నటి బ్రూక్‌ షీల్డ్స్‌ వెల్లడించారు. అయితే, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానన్నారు. రెండో భార్య మార్లా మేపుల్స్‌తో విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్‌ తనకు ఫోన్‌ చేశాడని, అప్పుడు తాను ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నానని తెలిపారు. ‘

రెండో భార్య నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్‌ నాకు ఫోన్‌ చేశాడు. నువ్వు అమెరికన్ల హృదయసామ్రాజ్ఞివి.. నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుడిని.. మనిద్దరం కలిస్తే అందరికీ సంతోషం అంటూ డేట్‌కి రావాలని ప్రపోజ్‌ చేశాడు. నాకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించాను’ అని బ్రూక్‌ తాజాగా వెల్లడించారు. ట్రంప్‌ను తిరస్కరించిన హాలీవుడ్‌ తారల జాబితాలో సల్మా హయక్, కేండిస్‌ బెర్జెన్, ఎమ్మా థాంప్సన్‌ల సరసన తాజాగా బ్రూక్‌ షీల్డ్స్‌ కూడా చేరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement