మొబైల్ షాపులో దొంగతనం జరుగుతుండగా సీసీ కెమెరాలో నమోదైన దృశ్యం
శ్రీకాకుళం, మందస: మొబైల్ కావాలని యజమానిని మాటల్లో దింపి.. దుకాణంలోని ఖరీదైన మొబైల్‌తో పాటు మరో ఫోన్‌ను ఇద్దరు యువకులు చోరీ చేసి జారుకున్నారు. ఈ సంఘటన మందస మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బాలిగాం–హరిపురం జంక్షన్‌లోని శ్రీకామేశ్వరి కమ్యూనికేషన్స్‌లో కొత్త మొబైల్ కావాలని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారితో మాట్లాడుతూ యజమాని మద్ది అరుణ్ మరో కస్టమర్‌తో కూడా మాట్లాడిన అనంతరం కంప్యూటర్ పనిలో నిమగ్నమై ఉండగా, వచ్చిన వ్యక్తులిద్దరూ ఖరీదైన మొబైల్‌తో పాటు రూ.10వేలు టాక్‌టైం ఉన్న డెమో మొబైల్‌ను దొంగిలించి జారుకున్నారు.
ఫోన్లు కనిపించకపోవడంతో సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించగా దొంగతనం జరిగిందని అరుణ్ గుర్తించి లబోదిబోమంటూ పుటేజ్‌లో కొంతభాగాన్ని ఫేస్‌బుక్, వాట్సప్‌లో పెట్టారు. నిందితులు గొప్పిలిలో ఉన్నారని అక్కడి మొబైల్ షాప్ యజమాని తెలిపారు. అరుణ్ అక్కడికి చేరుకునేలోగా గొప్పిలి నుంచి కూడా నిందితులు జారుకున్నారు. కాగా, ఇటీవల హరిపురంలోని రట్టిరోడ్ జంక్షన్ వద్ద గల ఓ మొబైల్ దుకాణంలో కూడా దొంగతనం జరగ్గా సీసీ ఫుటేజ్‌తోనే నిందితులను గుర్తించారు. ఈ రెండు సంఘటనలు కూడా పోలీసు కేసు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment