తిరుపతి: సెలెక్ట్ మొబైల్స్ బుధవారం తిరుపతిలో మూడు రిటైల్ మొబైల్ స్టోర్లను ప్రారంభించింది. బైపాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టోరును సినీ నటి కియారా అద్వానీ ప్రారంభించారని సంస్థ తెలియజేసింది. ఇక రెండు, మూడు షోరూమ్‌లను సెంట్రల్ పార్క్ వద్ద, తిలక్ రో డ్‌లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
‘ప్రస్తుతం తిరుపతిలో మూడు స్టోర్లు ప్రారంభించాం. ఇదే నెలలో హైదరాబాద్‌లో మరో 20 స్టోర్లను ఏర్పా టు చేస్తాం. త్వరలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 100 వరకు స్టోర్లను ప్రారంభిస్తాం. అలాగే మహారాష్ట్ర, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ విస్తరిస్తాం. 500 స్టోర్ల ఏర్పాటే మా లక్ష్యం’అని సెలెక్ట్ మొబైల్స్ చైర్మన్, ఎండీ వై.గురుస్వామి నాయుడు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment