మరోసారి వాయిదా? | Release of Suriya's Singam 3 postponed again | Sakshi
Sakshi News home page

మరోసారి వాయిదా?

Published Tue, Jan 24 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

మరోసారి  వాయిదా?

మరోసారి వాయిదా?

నటుడు సూర్య చిత్ర విడుదల మరోసారి వాయిదా పడిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీ–3. అనుష్క, శ్రుతీహాసన్  కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్‌ చిత్రం సింగంకు సిరీస్‌గా తెరకెక్కిన మూడో చిత్రం అన్నది తెలిసిందే. కమర్షియల్‌ దర్శకుడు హరీ తాజా చిత్రం ఇది. స్టూడియో గ్రీన్  సంస్థ నిర్మించిన భారీ చిత్రం సీ–3. ఇప్పటికే రెండు సార్లు పేర్లను, రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. సూర్య మరోసారి పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో నటించిన ఈ సీ–3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్ర ట్రైలర్‌ థియేటర్లలో దుమ్మురేపుతోంది.

కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గతేడాది డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేశారు. కరెక్ట్‌గా అలాంటి సమయంలో ప్రధాని పెద్ద నోట్ల రద్దు ప్రకటన సీ–3 చిత్ర విడుదలకు ఆటంకంగా మారింది. దీంతో జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఇప్పుడు జల్లికట్టు వివాదం మరోసారి సీ–3 చిత్ర విడుదలకు అడ్డపడిందని తెలుస్తోంది.

జల్లికట్టు పోరాటం తమిళనాడులో తీవ్రరూపం దాల్చడంతో ఈ సమస్య సద్దుమణిగిన తరువాత సీ–3 చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా కాస్త లేటుగా అయినా సీ–3 లేటెస్ట్‌గా ఉంటుందని చిత్ర దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నారని చెప్పవచ్చు. చిత్ర తదుపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement