సీ–3 వ్యాపారం రూ. 100 కోట్లు | C-3 Business Rs. 100 crore | Sakshi
Sakshi News home page

సీ–3 వ్యాపారం రూ. 100 కోట్లు

Published Tue, Jan 31 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

సీ–3 వ్యాపారం రూ. 100 కోట్లు

సీ–3 వ్యాపారం రూ. 100 కోట్లు

సాధారణంగా సినిమా విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తే దాని కలెక్షన్లను బట్టి 100, 200 కోట్ల క్లబ్‌లో చేరిందంటుంటారు. అలాంటిది సీ–3 చిత్రం వ్యాపారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని ఆ చిత్ర నిర్మాత చెప్పారు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీ–3. ఇది సింగం చిత్రానికి రెండో సీక్వెల్‌. హరి దర్శకత్వం వహించిన ఇందులో అనుష్క, శ్రుతీహాసన్  కథానాయికలు. స్టూడియో గ్రీన్  పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో చిత్ర యూనిట్‌ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ హీరోల స్థాయిని వారు పొందుతున్న పారితోషికంతో చిత్రాల వ్యాపారం పరంగా లెక్కకట్టాలన్నారు.

తమ సీ–3 చిత్రం రూ. 100 కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు. ఆ విధంగా చూస్తే రజనీకాంత్‌ తరువాతి స్థానంలో సూర్య ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం సూర్య మాట్లాడుతూ తన 20 ఏళ్ల నటజీవితంలో 35 చిత్రాల్లో నటించానని..వాటిల్లో సింగం చిత్రానికి ప్రత్యే చోటుంటుందని చెప్పారు. తాను దర్శకుడు హరితో కలిసి చేసిన ఐదవ చిత్రం ఇదని తెలి పారు. సీ–3 చిత్రం రూ.100 కోట్ల వ్యాపారం చేసిందనే కారణంతో రజనీకాంత్, కమలహాసన్ లతో పోల్చుతున్నారని, నిజానికి వారితో పోల్చితే తాను చిన్న పిల్లాడినన్నారు. జల్లికట్టు పోరాటంలో పోలీసులు హింసాత్మక చర్యలక పా      ల్పడడం బాధాకమని.. అయితే పోలీసులందరినీ అందుకు బాధ్యుల్ని చేయడం కరెక్ట్‌ కాదని చెప్పారు. పోలీస్‌ అంటే ఇలా ఉండాలి అనేలా ఈ చిత్రంలో దురైసింగం పాత్ర ఉంటుందని ఆయన చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement