
ఇండియా నా రెండో ఇల్లు
ఇండియా నా రెండో ఇల్లు. ఇలా అన్నది ఎవరో తెలుసా? నేటి టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సంచలన నటి శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న మైఖేల్ కోర్‌సెల్. కమలహాసన్ వారసురాలు శ్రుతీహాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌తో చెటా్టపటా్టల్ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన శ్రుతీహాసన్ మైఖేల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేననీ, అయినా తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదనీ బాహాటంగానే వెల్లడించారు.
కాగా ఒక ఆల్బం రికార్డింగ్ కోసం లండన్ వెళ్లిన శ్రుతీహాసన్ కు అక్కడ పరిచయం అయిన వ్యక్తే మైఖేల్. వారి పరిచయం స్నేహంగా మారి ఆపై మైఖేల్ శ్రుతీహాసన్ కు బాయ్‌ఫ్రెండ్‌గా మారాడన్నది సినీవర్గాల టాక్. కాగా ఇటీవల ఇండియా వచ్చిన మైఖేల్‌ను శ్రుతీ విమానాశ్రయంలోనే రిసీవ్ చేసుకుని ఇద్దరు సన్నిహితంగా నడిచి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే అలాంటి ప్రచారం గురించి తాను చింతించేది లేదనీ, అసలు ఆ విషయమై స్పందించడానికి ఇష్టపడడం లేదనీ, ఇంకా చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదనీ ఇప్పటికే నటి శ్రుతీహాసన్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ తన వెబ్‌సైట్‌లో ఇండియాకు వచ్చినప్పుడు అదు్భతవైున యువతి శ్రుతితో కాలం సంతోషంగా గడిచి పోయిందన్నారు. ఆమె అందవైున స్నేహితుల బృందాన్ని కలుసుకున్నాననీ, ఇండియా తనకు రెండో ఇల్లు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలే కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారాయి.