సంక్రాంతి రాయుడు! | pawan kalyan new teaser release to sankranthi | Sakshi
Sakshi News home page

సంక్రాంతి రాయుడు!

Published Sat, Jan 14 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

సంక్రాంతి రాయుడు!

సంక్రాంతి రాయుడు!

పంట పొలాలు... పచ్చని కొబ్బరిచెట్లు... ఎడ్లబళ్లు... సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసే మనుషులు... సంక్రాంతి, ఉగాది పండగల పేర్లు వినగానే ప్రేక్షకులకు ఇవే గుర్తొస్తాయి కదూ! ఈ సందడంతా అభిమాన హీరో సినిమాలో కనిపిస్తే... పండగే కదా! ఉగాదికి థియేటర్లలో అలాంటి సందడి తీసుకు రావడానికి ‘కాటమరాయుడు’ రెడీ అవుతున్నాడు. సాంపిల్‌ అన్నట్లు సంక్రాంతి కానుకగా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. పంచెకట్టు, ఎడ్లబండి.. ఈ స్టిల్‌లో పల్లె సందడి మొత్తం కనిపిస్తోంది కదూ.

పవన్‌కల్యాణ్, శ్రుతీహాసన్‌ జంటగా కిశోర్‌ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్‌మరార్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ నెల 26న టీజర్‌ విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ నెల 16న తాజా షెడ్యూల్‌ మొదలవుతుంది. ఉగాది కానుకగా మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement