అందాలారబోతలో తప్పులేదు | sruthihasan about exposing | Sakshi
Sakshi News home page

అందాలారబోతలో తప్పులేదు

Published Sun, Jan 1 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM

అందాలారబోతలో తప్పులేదు

అందాలారబోతలో తప్పులేదు

అందాలారబోతలో తప్పులేదు అంటూ మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు నటి శ్రుతిహాసన్. కథానాయికులు పొట్టి దుస్తులు ధిరిస్తేనే యువత చూస్తారని, అందుకే వారికి కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్లు ఇటీవల దర్శకుడు సూరజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి తమన్నా, ఆమెకు మద్దతుగా నయనతార, నటుడు విశాల్, రానా వంటి నటీనటులు ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ  మూకుమ్మడి దాడి చేయడంతో సూరజ్‌కు వేరే దారి లేక క్షమాపణ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన కాస్త సద్దుమణిగిందో లేదో సంచలన నటి శ్రుతిహాసన్ గ్లామర్‌ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

హీరోయిన్లు అందాలారబోయడం ఏమాత్రం తప్పు కాదని పేర్కొన్నారు. ఈ మోడరన్ కాలంలో హీరోయిన్లు గ్లామరస్‌గా నటించడం చాలా అవసరం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమర్షియల్‌ చిత్రాలకు ఒక స్థాయిలో గ్లామర్‌ అవసరం అవుతుందన్నారు. అందులో కథానాయికలు పాలు పంచుకోవలసి వస్తోందని అన్నారు. కథ డిమాండ్‌ మేరకు హీరోయిన్లు అందాలారబోయాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందులో నటనకు అవకాశం ఉంటుందని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ సూర్యతో నటించిన ఎస్‌–3 చిత్రం ఈ నెల 26న తెరపైకి రానుంది. ప్రస్తుతం తన తండ్రితో కలిసి శభాష్‌నాయుడు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement