శీనుతో శ్రుతి | sruthi hasan ready to act alludu srinu hero belemkonda srinu | Sakshi
Sakshi News home page

శీనుతో శ్రుతి

Published Fri, Aug 8 2014 11:31 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

శీనుతో శ్రుతి - Sakshi

శీనుతో శ్రుతి

కొత్త హీరోల సరసన స్టార్ హీరోయిన్లను నటింపజేయడమంటే... ఇది వరకు తలకు మించిన పని. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

కొత్త హీరోల సరసన స్టార్ హీరోయిన్లను నటింపజేయడమంటే... ఇది వరకు తలకు మించిన పని. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సంస్థ, దర్శకుడు, పారితోషికం... ఈ మూడూ సరిగ్గా ఉంటే... కొత్తబ్బాయిలతో జతకట్టడానికి కూడా మన స్టార్ హీరోయిన్లు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉంది. దక్షిణాదికే కొత్త. ఈ మధ్య ‘అల్లుడుశీను’తో కలిసి సమంత, తమన్నా ఆడిపాడారు. ఇప్పుడు శ్రుతీ వంతు వచ్చింది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న తదుపరి సినిమాలో కథానాయికగా నటించడానికి శ్రుతి పచ్చజెండా ఊపేశారని ఫిలింనగర్ సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే శ్రుతికి బోయ పాటి కథ వినిపించేశారట. శ్రుతీహాసన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement