ఇది ఓ విజువల్ ఫీస్ట్ : దేవిశ్రీ ప్రసాద్ | Devi Sri Prasad at Vijay's Puli Telugu audio released | Sakshi
Sakshi News home page

ఇది ఓ విజువల్ ఫీస్ట్ : దేవిశ్రీ ప్రసాద్

Published Thu, Sep 24 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

ఇది ఓ విజువల్ ఫీస్ట్ : దేవిశ్రీ ప్రసాద్

ఇది ఓ విజువల్ ఫీస్ట్ : దేవిశ్రీ ప్రసాద్

 ‘‘ ‘పులి’ లాంటి అడ్వంచరస్, ఫ్యాంటసీ చిత్రానికి మ్యూజిక్ అందించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు శింబుదేవన్ విజన్‌కు హ్యాట్సాఫ్’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. శింబుదేవన్ దర్శకత్వంలో  విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా, సీనియర్ నటి శ్రీదేవి ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పులి’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సిబు థమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా పతాకంపై శోభారాణి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
  పాటల సీడీలను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఈ కథ విని చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. పాటలు స్వరపరచడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్’’ అని అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘విజయ్ నటించిన సినిమాలు తెలుగులో బాగా ఆడాయి. ఏ భాషా చిత్రాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు.
 
 ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘ ‘తుపాకి’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత  విజయ్‌గారు హీరోగా నటించిన ‘పులి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి శ్రీదేవి క్యారెక్టర్ హైలైట్. దర్శకుడు ఆమె క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని శోభారాణి అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు కొరటాల శివ, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement