
ఊరికి మొనగాడు
చాలా రోజుల తరువాత మళ్లీ ‘శ్రీమంతుడు’తో మీ ముందుకొస్తున్నా. ఇది మంచి స్క్రిప్ట్. తెలుగులోని బెస్ట్ రైటర్స్‌లో ఒకరైన కొరటాల శివ
మహేశ్‌తో స్పెషల్ చిట్‌చాట్
► మహేష్ తన ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాడు.
► మహేష్ ఫ్యాన్స్ మహేష్‌ని దత్తత తీసుకున్నారు.
► సినిమా ఫ్యాన్స్ మహేష్ నటనను దత్తత తీసుకున్నారు.
► మహేష్.... మహేష్ కంటే పెద్దవాడైపోయాడు...ఇమేజ్ ప్రభావం.
► తనని తాను దత్తత తీసుకోలేనంతగా ఎదిగిపోయాడు.
► శుక్రవారం లక్ష్మీకటాక్షమూ అభిమాన ధనప్రాప్తమూ ఉంటుందని చిద్విసిలాసంగా మాట్లాడాడు. శుభం.
► జరిగేవన్నీ మంచికని ఈ శ్రీమంతుడు, ఊరిని దత్తత తీసుకున్న ఈ మొనగాడు...
► తప్పులను దత్తత తీసుకుని కొత్త క్యారెక్టర్లను మంచి పెంపకంతో మార్చుకుంటున్నాడు.
► అయినా సరే ధైర్యంగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడు.
► దత్తత తీసుకున్న ఇంతమంది ఆశయానికి పని చేయాలి తప్పదు!
► సినిమాను ప్రేమించి చేద్దామని ఆశ పడితే సరిపోవడం లేదు.
‘శ్రీమంతుడు’తో ఆగస్ట్ 7న పలకరించనున్న మహేశ్ చెప్పిన ముచ్చట్లు...
చాలా రోజుల తరువాత మళ్లీ ‘శ్రీమంతుడు’తో మీ ముందుకొస్తున్నా. ఇది మంచి స్క్రిప్ట్. తెలుగులోని బెస్ట్ రైటర్స్‌లో ఒకరైన కొరటాల శివ చెప్పిన కథ బాగుంది. కథలో బలమైన విషయముందని ఫీలయ్యా. అందుకే, చెప్పగానే ఒప్పుకున్నా. చెప్పినదానికన్నా బాగా తీశారాయన. మా జర్నీ బాగుంది.
ఈ సినిమా, పాత్ర కోసం అనేకం వదిలేశా!
‘ఖలేజా’, ‘దూకుడు’ లాంటి సినిమాల్లో చేసిన పాత్రల్లో కామెడీ మిళితమై ఉంటుంది. కానీ, ప్రతి సినిమాలో అలాగే ఉండడం కుదరదుగా! ‘శ్రీమంతుడు’లో పాత్ర కొత్తగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఉండదు. నటిస్తున్నట్లు కాకుండా, క్యారెక్టర్‌లా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అందుకే, నటనకు సంబంధించి గతంలో అలవాటైన అనేక అంశాలను వదులుకున్నా. ఇక, టైటిల్ గురించి చెప్పాలంటే, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కాగానే శివ గారు వచ్చి ‘శ్రీమంతుడు’ టైటిల్ చెప్పారు. ఆ టైటిల్ జస్ట్ యాప్ట్.
నిర్మాణం నాకు కొత్తేమీ కాదు!
నిర్మాణంలో పార్ట్‌నర్ కావడం నాకు కొత్తేమీ కాదు. గతంలో మా అక్కయ్య, మా అన్నయ్య సినిమాలకూ చేశా. అప్పట్లో ఎగ్జిక్యూషన్ కూడా చేశాం. ఈసారి ‘ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్’ అని సొంత బ్యానర్‌పై, ఎగ్జిక్యూషన్‌తో సంబంధం లేకుండా చేస్తున్నా. అంతే తేడా! నా బ్యానర్‌పై ప్రస్తుతానికి నా సినిమాలే ఉంటాయి. అసలు వీటికే టైమ్ సరిపోదు, ఇతరులతో తీయడమెక్కడ?
ఈ సినిమా, పాత్ర కోసం చాలా వదిలేశా!
ఒకవైపు నటన, మరోవైపు నిర్మాణం చేస్తున్నా. ఇక దర్శకత్వమంటారా? ఆ ఆలోచన ఏమీ లేదు. డెరైక్షన్ చేయమంటున్నారు... (నవ్వుతూ) ఏమిటీ? ఇక్కడున్న అందరినీ పంపించేద్దామనే...!
ఆస్వాదిస్తూ చేస్తే... అద్భుతం!
ఫ్యాన్స్‌ను మెప్పించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటా. ‘శ్రీమంతుడు’లో డ్యాన్సులు బాగున్నాయంటే డ్యాన్స్‌మాస్టర్ రాజుసుందరం, డెరైక్టర్ శివ ప్రతిభ. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ చేసుకు వెళ్ళానంతే! ఏ పనైనా ఆస్వాదిస్తూ చేస్తే అద్భుతమైన అవుట్‌పుటొ స్తుంది. చారుశీలా పాటకి పేరురావడానికదే కారణం.
శ్రుతీహాసన్ టెరిఫిక్ పెర్ఫార్మర్!
కమలహాసన్ గారికి ఫ్యాన్‌ని. ఆయన కూతురు శ్రుతీహాసన్ టెరిఫిక్ పెర్ఫార్మర్. నా దృష్టిలో ఇప్పటి వరకు చేసినవాటిలో ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక, నా తండ్రి పాత్రకు సరిగ్గా ఆయన లాంటి స్టేచర్ ఉన్నవాళ్ళు కావాలని జగపతిబాబును ఎంచుకున్నాం.
ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్!
కో-ప్రొడ్యూసర్‌ను కాబట్టి, ‘శ్రీమంతుడు’కి నేనే స్వయంగా ప్రమోషన్‌కు రావడమని కాదు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసినప్పుడు, దానికి ప్రమోషనూ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే, ఇంత ప్రమోట్ చేస్తున్నా.
నేను ఎక్స్‌పరిమెంట్స్ చేయలేదా?
కొత్త తరహా పాత్రలు చేయరేంటని కొందరు అడుగుతుంటారు. ఏం! నేను ఎక్స్‌పరిమెంట్స్ చేయలేదా? ‘టక్కరిదొంగ’, ‘నాని’, ‘1... నేనొక్కడినే’ -ఇవన్నీ ఎక్స్‌పరిమెంట్సే కదా! ఐ ఎక్స్‌పరిమెంటెడ్ ఎ లాట్! దురదృష్టవశాత్తూ అవేవీ వర్కౌట్ కాలేదు. బహుశా, వాటిలో తప్పులు జరిగి ఉంటాయి. మరోపక్క ఇవాళ ప్రతి సినిమా బిగ్ బడ్జెట్‌తో తయారవుతోంది కాబట్టి, పాత తప్పులు రిపీట్ కాకుండా నేను చూసుకోవాలి!
అల్లూరి సీతారామరాజు నాకు బైబిల్!
నాన్న గారి సినిమాల్లో ‘అల్లూరి సీతారామరాజు’ నాకు బైబిల్ లాంటిది. వందసార్లయినా చూసి ఉంటా. అలాంటి క్లాసిక్‌ను మళ్ళీ మళ్ళీ చూసి ఆనందించాలే తప్ప, మనం చేయాలని టచ్ చేయకూడదు. ఇక, నాన్న గారి లాగా జేమ్స్‌బాండ్ తరహా సినిమాలంటారా? అలాంటి కథతో నేను బాగుంటానని అనుకున్న డెరైక్టర్స్, రైటర్స్ తమదైన విజన్‌తో ముందుకొస్తే ఓకె. అంతేకానీ, నాకు ఫలానా పాత్ర చేయాలనుందని, నేనే కథ వండించడం కరెక్ట్ కాదు.
తమిళంలోకీ వెళుతున్నా!
‘అతడు’ లాంటి డబ్బింగ్ వెర్షన్లు తమిళంలో బాగా ఆడాయి. ‘శ్రీమంతుడు’ తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయాలని నెల క్రితం దాకా అనుకోలేదు. కానీ, కెమేరామన్ ‘మది’ ఈ యూనివర్సల్ సబ్జెక్ట్‌ను తమిళంలోనూ అందిస్తే బాగుంటుందన్నారు. పైగా, తమిళ యూత్, లేడీస్ నా తెలుగు రిలీజ్‌లు చూస్తుంటారు కాబట్టి, తెలుగుతో పాటే తమిళంలో డబ్ చేసి, రిలీజ్ చేయాలనుకున్నాం. నెక్స్ట్ ‘బ్రహ్మోత్సవమ్’ను తెలుగుతో పాటు, తమిళంలోనూ స్ట్రెయిట్ ఫిల్మ్‌గా తీస్తున్నాం. చెన్నైలో పుట్టి పెరిగా కాబట్టి, తమిళం గడగడా మాట్లాడగలను కానీ, టైమ్ లేక డబ్బింగ్ చెప్పలేదు. మే బి నెక్స్ట్ టైమ్! ఈ 4న తమిళ శ్రీమంతుడు ‘సెల్వందాన్’ ఆడియో రిలీజ్. పుట్టి పెరిగిన చోట సొంత సినిమాకు ఈ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమ్.
బాలీవుడ్‌కు టైమ్ లేదు!
బాలీవుడ్ ఈజ్ ఎ బిగ్గర్ క్యాన్వాస్. కానీ, అక్కడ చేయడానికి, టు బి ఆనెస్ట్ అంత టైమ్ ఎక్కడుంది! తెలుగులోనే ఏటా రెండు సినిమాలు చేయాలంటే కుదరడం లేదు. కథలున్నాయి, దర్శకులున్నారు కానీ, ప్రతి సినిమాకూ ఏడెనిమిది నెలలవుతోంది. బాలీవుడ్‌కెళితే, రెండు, మూడేళ్ళు మన చిత్రాల్లో కనపడం! అందుకే నాకా ఉద్దేశం లేదు.
‘బజ్‌రంగీ భాయ్’ లాంటి వాటికి నేను రెడీ!
హిందీలో ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’, ‘పీకే’ లాంటి సినిమాలు ఇక్కడా రావాలి. ఇక్కడెందుకు రావడం లేదనే ప్రశ్న నన్ను కాదు... దర్శకులనూ, రచయితలనూ అడగాలి. నిజం చెప్పాలంటే, అవి ఎక్స్‌పరిమెంట్స్ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు. ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిన సినిమాలు. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే చేయడానికి నేను రెడీ! కొత్త దర్శకులతోనూ చేస్తా!
నాకు ఫ్రెండ్స్ లేరు!
ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే. కానీ, నిజం చెప్పాలంటే నా లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్ మాట అలా ఉంచండి. నాకు ఫ్రెండ్సే ఎక్కువ లేరు. ఉన్నవాళ్ళంతా చెన్నైలోనే ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చేశాక, వాళ్ళతో టచ్ పోయింది. చేస్తున్న సినిమాల దర్శకులు, యూనిట్లే నాకిప్పుడు ఫ్రెండ్స్.
మా అమ్మాయి నాటీ!
మా పిల్లలిద్దరిలో అమ్మాయే నాటీ! మా అబ్బాయి గౌతమ్ గుడ్ బాయ్. మూడేళ్ళ మా సితార మాత్రం మహా నాటీ. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే నాకు టైమ్ తెలీదు.
మా మూడు తరాలూ కలసి సినిమా!
నాన్న గారు, నేను, మా గౌతమ్ - ఇలా మూడు తరాలం కలసి సినిమా చేస్తే, బాగుంటుంది. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్. అందుకు తగ్గ మంచి కథ దొరికితే, తప్పకుండా చేస్తాం.
సారీ చెప్పింది అందుకే!
ఫెయిల్యూర్స్ రూపంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రభావం నా మీదా ఉంటుంది. గత రెండు చిత్రాలు ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన మాట నిజం. ‘శ్రీమంతుడు’ ఆడియో రిలీజ్ వేడుకలో వాళ్ళకు సారీ చెప్పింది అందుకే! కాకపోతే, ఫెయిల్యూర్స్ నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. అంతేతప్ప, ఇట్ డజ్ నాట్ ఎఫెక్ట్ మై ఛాయిసెస్. థియేటరికల్ రిలీజ్ టైమ్‌లో అంతగా ఆదరణ పొందని ‘1...నేనొక్కడినే’ లాంటి సినిమాలను టీవీలో చూసి, జనం అద్భుతం అంటూ ఉంటే, ఏం చేస్తాం! ఒక చిన్న నవ్వు నవ్వడం తప్ప!
నేనెప్పుడూ ఎవరి మాటా వినలేదు..!
మీకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్. అభిమాన ధన శ్రీమంతుడైన మీరు ఈ సినిమా ద్వారా ఇంకేం సంపాదించాలనుకుంటున్నారు?
సంపాదించడం ఏమీ లేదు. ప్రతి సినిమాకూ ఒకటే గోల్... ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. దాని గురించి కష్టపడి పనిచేస్తాం అంతే.
ఈ సినిమా మీ కెరీర్‌కు ఎంతవరకు క్రూషియల్?
కెరీర్‌లో ప్రతి సినిమా కీలకమే. ఆ మాటకొస్తే, ప్రతి శుక్రవారం వెరీ క్రూషియల్. ఎందుకంటే సినిమా చాలామంది డబ్బులతో ముడిపడిన వ్యవహారం. మీరన్నట్లు ‘శ్రీమంతుడు’ నా కెరీర్‌కు చాలా క్రూషియలే. (నవ్వుతూ) ఎందుకంటే గత సినిమాలు ‘1’, ‘ఆగడు’ ఆడలేదుగా!
గత అనుభవాలతో ఆత్మపరిశీలన చేశారా? నేర్చుకున్న పాఠాలేంటి?
అదేమీ లేదండీ! బ్యాడ్ సినిమా చేయాలని ఎవరూ అనుకోరు. సమ్‌టైమ్స్ వియ్ మేక్ మిస్టేక్స్. వియ్ లెర్న్ ఫ్రమ్ దోజ్ మిస్టేక్స్. లాస్ట్ టైమ్ చేసిన మిస్టేక్ ద్వారా కంటెంట్ కన్నా ఏదీ గొప్పది కాదని అర్థమైంది. కంప్లీట్ ప్యాకేజ్‌లా చేయాలి. అన్ని యాంగిల్స్‌నూ కవర్ చేయాలి. స్టోరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని తెలిసింది. ‘శ్రీమంతుడు’ హీరో కన్నా కంటెంట్ గొప్పదని నిరూపిస్తుంది. కంటెంట్ ఈజ్ బిగ్గర్ దేన్ ఎనీ స్టార్!
ఫ్యాన్స్, స్టార్ ఇమేజ్ కంటెంట్ డెవలపింగ్‌లో ఇబ్బందిగా మారతాయా?
డెఫినెట్లీ! స్టార్స్‌కు అదే ప్రాబ్లమ్. ఇమేజ్‌కు తగ్గట్టు సినిమా తీయాలి. అదే సమయంలో ఎప్పుడూ ‘ఇది చేయాలి..అది చేయాలి’ అంటూ పక్కనున్న వాళ్లు కూడా కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. అందుకే, ఓన్‌గా డెసిషన్ తీసుకోవడం మంచిది. అందుకే, నేనెప్పుడూ ఎవరి మాటా వినలేదు. ఏదైనా సరే నా నిర్ణయమే. నాకు తోచిందే చేశా. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ అవన్నీ నా మిస్టేక్స్! ఆల్వేస్ ఐ టుక్ డెసిషన్స్ ఆన్ మై ఓన్! వర్కౌట్ అవకపోతే ఐ లెర్న్ట్ మై మిస్టేక్స్! ‘వాళ్లు చెప్పారు కాబట్టి నేను చేశా’నని ఎప్పుడూ అనను. దిస్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్!
ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటారా?
జాగ్రత్తలు తప్పవు. ఫ్యాన్స్‌కి గత సినిమాలో పాటలు నచ్చలేదంటే, ఎందుకో తెలుసుకుని ఈ సారి ఇంకా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తా.
బాలనటునిగానే ప్రయాణం మొదలు పెట్టారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎప్పుడైనా, ఏదైనా స్పెషల్‌గా చేయాలనిపించిందా?
నిజం చెప్పాలంటే, ఎప్పుడూ అలానే అనుకుంటూ ఉంటా. అలా వచ్చినవే - ‘టక్కరిదొంగ’, ‘నాని’, ‘ఒక్కడు’. అలాగే, ‘పోకిరి’ కూడా ఆ టైమ్‌కి ఫ్రెష్ కదా. ఏ కథలో అయినా ఫ్రెష్‌నెస్ గురించే చూస్తా. రెగ్యులర్‌గా అనిపిస్తే నాకూ బోర్ కొడుతుంది.
‘సీతమ్మ వాకిట్లో...’ లానే ‘శ్రీమంతుడు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనరా?
‘శ్రీమంతుడు’ ఓ బిగ్ క్యాన్వాస్‌లో చెప్పిన కథ. ఇటీజ్ లార్జర్ దేన్ లైఫ్. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. శివగారు గతంలో తీసిన ‘మిర్చి’ కూడా పెద్ద క్యాన్వాస్ సినిమా. చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇదీ అంతే. హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా ఉంటాయి. నేను వినగానే చాలా ఎగ్టయిట్ అయ్యా. చూశాక కూడా చాలా బాగా నచ్చింది.
ఊరిని దత్తత తీసుకునే ఈ చిత్ర కాన్సెప్ట్ మీ లైఫ్‌లోనూ జరిగిందిగా?
అదేమీ లేదండి జస్ట్ కో-ఇన్సిడెన్స్. ‘ఆగడు’ సెట్స్‌పై ఉండగా, శివ ఈ కథ చెప్పారు. ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. చేస్తూ వచ్చాం. తరువాత మా ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నా. సినిమా రిలీజయ్యాక ఊరికి ఏం చేయాలి, ఎలా చేయాలనేది కుటుంబసభ్యులతో కూర్చొని ప్లాన్ చేస్తాం.
మీ నిర్ణయాల్లో మీ శ్రీమతి నమ్రత పాత్ర ఎలాంటిది?
సినిమాకు సంబంధించిన నిర్ణయాల్లో నాదే డెసిషన్. నేను హీరోగా పరిచయమైన ‘రాజకుమారుడు’ సినిమా నుంచి మా నాన్నగారు నాకు ఆ స్పేస్ ఇచ్చారు. నాకు నేను ఏదైనా సొంతంగా చేయాలనే భావనతో ఆయన ఉండేవారు. అందుకే ఆయనంటే నాకు చెప్పలేనంత ఆరాధన. ‘ఇలా చేయాలి. ఇది చేయకూడదు’ అని ఆయనెప్పుడూ అనలేదు. ఏదైనా మనంతట మనం చేయాలి. నేర్చుకోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. సినిమాలు తీస్తుంటే హెల్ప్ చేయడానికి నమ్రత ఉంటుంది. అంతే తప్ప నా నిర్ణయాలు నావే. ఇంటి బడ్జెట్ అయినా, సినిమా బడ్జెట్ వ్యవహారాల లాంటి ఆర్థిక విషయాలైనా తనే చూసుకుంటుంది.
కో-ప్రొడక్షన్‌తో స్టార్ హీరో రంగంలోకి దిగుడం వల్ల ఏమైనా ఎడ్వాంటేజ్ ఉంటుందంటారా?
తప్పకుండా ఎడ్వాంటేజ్ ఉంటుంది. బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. రెమ్యునరేషన్ త గ్గించుకోవచ్చు.రెమ్యునరేషన్ తగ్గించి, మహేశ్ జాగ్రత్తగా చేస్తున్నాడ ని మీ నాన్నగారు ఆ మధ్య చెప్పారు. నిజానికి, మునుపెన్నడూ ఏ సినిమాకూ రానంత రెమ్యూనరేషన్ నాకు ఈ సినిమాకు వచ్చింది. అదే సమయంలో బడ్జెట్ ఈజ్ అండర్ కంట్రోల్. కో-ఆర్డినేషన్‌తో చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. రిలీజ్ తర్వాత ఏమైనా ప్రాఫిట్స్ వస్తే, నాకూ కొంత వస్తాయి. ఇటీజ్ గుడ్ ఫర్ ఎనీ అదర్ హీరోస్ టు డూ ఇట్ టు కీప్ బడ్జెట్ ఇన్ కంట్రోల్.
మణిరత్నం గారితో సినిమా చేయాలనే ఆలోచన ఏమైంది?
అవునండీ. కానీ దురదృష్టవశాత్తూ, అది వర్క్‌వుట్ కాలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. రాజమౌళితో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎప్పుడన్నది కరెక్ట్‌గా చెప్పలేను.
‘బాహుబలి, రుద్రమదేవి’ లాంటి భారీ సినిమాలు రావడంపై?
ఇంత పెద్ద స్టాండర్డ్స్‌తో రాజమౌళిగారు సినిమా తీయడం గర్వంగా అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపూ ఎగ్జయిట్ అయ్యా. ఆయనకు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాను. తెలుగు సినిమా స్టామినా ఉందని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పా.
త్రీడీలో రానున్న తెలుగువారి చరిత్ర ‘రుద్రమదేవి’ గురించి...
ట్రైలర్ చూశా. దర్శకుడు గుణశేఖర్‌గారిని కలిసి మాట్లాడాను. త్రీడీలో చేయడం మామూలు విషయం కాదు. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్. ‘రుద్రమదేవి’ కూడా గొప్ప సినిమా అవుతుంది.
గోన గన్నారెడ్డిగా మిమ్మల్ని చూడాలనుకున్నా, చేయలేదేం?
టూ మెనీ డేట్స్ క్లాష్ కావడంతో చేయలేకపోయా.
స్టయిల్, లుక్స్‌లో మీరు హ్యాండ్సమ్. ఏదైనా ఎక్స్‌ట్రా కేర్?
ఫిట్‌నెస్ అనేది ప్రతి యాక్టర్‌కూ చాలా ముఖ్యం. అవి ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఇక, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాటా ఇప్పటికీ జనం ఫాలో అవుతున్న ‘పోకిరి’ షర్ట్ లాంటి స్టయిల్స్ అంటారా? కొన్ని క్యారెక్టర్స్, స్టయిల్స్ అలా వర్క్‌వుట్ అవుతాయి. ప్లాన్ చేస్తే ఏవీ కావు.
‘బాహుబలి’కి స్టార్స్ షేక్ అవ్వరు!
‘బాహుబలి’ కలెక్షన్స్ ఒక రకంగా మన మంచికే. స్టార్సేమీ షేకవ్వరు. ‘బాహుబలి’ అన్ని కోట్లు కలెక్ట్ చేశాక, తర్వాత వచ్చే సినిమాలు ఎక్స్‌ట్రా పది కోట్లు వసూలు చేస్తాయి. ఇలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ హీరోల సినిమాలకి కూడా 10 - 15 కోట్లు ఎక్కువ వస్తుంది. ఇన్నేళ్ల బట్టి నేను గమనించిన విషయం అది. ‘మగధీర’ తర్వాత అన్ని చిత్రాల రేంజ్‌లూ పెరిగాయి. ‘బాహుబలి’ కొత్త మార్కెట్ ఓపెన్ చేసింది. ఇదో శుభ పరిణామం.