నాకాబాధ లేదు | sruthihasan about exposing | Sakshi
Sakshi News home page

నాకాబాధ లేదు

Published Tue, Jan 10 2017 1:26 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నాకాబాధ లేదు - Sakshi

నాకాబాధ లేదు

ప్రస్తుతం అందాలారబోతకు అతీతులైన కథానాయికలు లేరనే చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో శ్రుతిహాసన్ కాస్త ఎక్కువని చెప్పడం అతిశయోక్తి అనిపించదు. చిత్రాలకు హీరోయిన్  అందాలు చాలా అవసరం అని ఈ అమ్మడే స్వయంగా వెల్లడించారన్నది గమనార్హం. ఆ మధ్య హిందీ చిత్రం దిడేలో శ్రుతీహాసన్  శృంగారభరత సన్నివేశాలు యువతకు యమ కిక్‌ ఇచ్చాయన్న విషయాన్ని మరచి పోలేం. అలా తమిళం, తెలుగు, హింది భాషల్లో నాయకిగా తనదైన బాణీలో రాణిస్తున్న శ్రుతిహాసన్  తాజాగా ఒక భేటీలో పేర్కొంటూ తనకిప్పుడు చాలా మంచి అవకాశాలు అభిస్తున్నాయని తెలిపారు. బాలీవుడ్‌లోనూ మూస పాత్రలను అంగీకరించడం లేదని చెప్పారు. అయితే ఇలా అన్ని చిత్రాల్లో అద్భుత పాత్రలు లభిస్తాయిని ఆశించకూడదన్నారు.

ఇప్పటి వరకూ నటించిన ప్రతి పాత్రా తన ఎదుగుదలకు దోహద పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా కుటుంబానికి చెందిన నటిని కావడం వల్ల నిర్బంధకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందా? అని అడుగుతున్నారని, తనకు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. నిజం చెప్పాలంటే తమది సినిమా కుటుంబం అయినా ఎప్పుడూ దాని గురించే ఆలోచించడం జరగదన్నారు. ఇతరుల మాదిరిగానే తాము జీవితానికి సంబంధించిన ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటామని అన్నారు. అదే విధంగా సినిమా విషయాలను తాను, తన చెల్లెలు అక్షర స్వయంగానేనిర్ణయించుకుంటామని చెప్పారు.

ఇక చిత్రాల జయాపజయాలను విభజించి మాట్లాడడం కష్టమేనన్నారు. కొన్ని చిత్రాలు అనూహ్య విజయాలను సాధిస్తాయని, ఒక్కో సారి అపజయాలను ఎదర్కోక తప్పదని అన్నారు. అందువల్ల జయాపజయాల గురించి తనకు ఎలాంటి బాధింపులేదని అన్నారు. పది చిత్రాలు చేస్తే అన్నీ విజయం సాధించాలని ఆశించడం సరికాదని శ్రుతిహీసన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement