ముందు ముత్తయ్యతోనేనా? | which movie act hero surya next ? | Sakshi
Sakshi News home page

ముందు ముత్తయ్యతోనేనా?

Published Mon, Aug 1 2016 3:04 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ముందు ముత్తయ్యతోనేనా?

ముందు ముత్తయ్యతోనేనా?

నటుడు సూర్య ప్రస్తుతం ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అనుష్క, శ్రుతీహాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సింగం చిత్రానికి మూడోభాగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సూర్య నటించే తదుపరి చిత్రం ఏమిటన్న విషయం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.కబాలి చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఉంటుందని స్వయాన సూర్యనే ఆ మధ్య వెల్లడించారు. అయితే తాజాగా దర్శకుడు ముత్తయ్య పేరు వినిపిస్తుండడం విశేషం. కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాల దర్శకుడు ముత్తయ్య. కొంబన్ చిత్రంలో కార్తీ కథానాయకుడిగా నటించారన్నది తెలిసిందే. విశాల్ హీరోగా నటించిన మరుదు చిత్రం ఆశించిన విజయాన్ని పొందలేదు. దీంతో దర్శకుడు ముత్తయ్య తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది.


తాజా సమాచారం సూర్య ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారట. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఆగస్ట్ నెల చివరగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి సెప్టెంబర్, లేదా అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రారంభంచడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. మరి రంజిత్‌తో చిత్రం ఏమైనట్లు అన్న ప్రశ్న చిత్ర వర్గాల్లో తలెత్తుతోంది. నిజానికి కబాలి చిత్రానికి ముందే రంజిత్ సూర్య చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. రజనీకాంత్ చిత్ర అవకాశం రావడంతో నిర్మాత జ్ఞానవేల్‌రాజా తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. సూర్య తదుపరి ఏ దర్శకుడితో చిత్రం చేస్తారన్నది అధికారికపూర్వకంగా ప్రకటించేవరకూ ఊహాగానాలిలా కొనసాగుతూనే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement