శ్రుతిని కలవరపెడుతున్న తోళా విజయం | sruthi hasan Disturbance giving a tola success | Sakshi
Sakshi News home page

శ్రుతిని కలవరపెడుతున్న తోళా విజయం

Published Mon, Mar 28 2016 4:12 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

శ్రుతిని కలవరపెడుతున్న  తోళా విజయం - Sakshi

శ్రుతిని కలవరపెడుతున్న తోళా విజయం

తోళా చిత్ర విజయం నటి శ్రుతిహాసన్‌ను కలవరానికి గురి చేసిందా? దీనికి చిత్ర వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అదేమిటి తోళా చిత్రం విజయవంతమైతే శ్రుతి కేమిటి చింతా అనేదేగా మీ సందేహం. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతోనో, ఇతర కారణాల వల్లో మంచి అవకాశాలను వదులుకుని ఆ తరువాత బాధ పడడం అనేది చాలా మందికి జరుగుతుంటుంది. నటి శ్రుతిహసన్ విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. నాగార్జున, కార్తీ కలసి న టించిన ద్విభాషా చిత్రం తోళా. తెలుగులో ఊపిరిగా తెరకెక్కి ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఇందులో నాయకిగా నటించిన తమన్నా ఖాతాలో మరో విజయం నమోదైంది. దీంతో ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయింది.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా,తోళా చిత్ర విజయం మాత్రం నటి శ్రుతిహాసన్‌కు మింగుడు పడడంలేదట. కారణం ఈ విజయం తనకు దక్కాల్సింది. ఎస్‌ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్‌గా ఎంపికైంది శ్రుతిహాసన్‌నే. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా పుచ్చుకున్న ఈ క్రేజీ బ్యూటీ ఆ తరువాత కాల్‌షీట్స్ కేటాయించకుండా చిత్ర యూనిట్‌కు సమస్యలు సృష్టించారనే ప్రచారం కూడా జరిగింది.అంతే కాదు శ్రుతిహసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిత్ర నిర్మాతల వర్గం పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లారు. ఈ విషయాలు పక్కన పెడితే మొత్తం మీద శ్రుతిహాసన్ ఆ చిత్రం నుంచి వైదొలగారు. ఆమె పాత్రలో నటించే అవకాశాన్ని మిల్కీబ్యూటీ తమన్న దక్కించుకుంది.ఇప్పుడు తోళా చిత్రం విజయం సాధించడం శ్రుతిహసన్‌ను కలవరపెడుతోందని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement