ఆత్మకథ రాస్తున్న నటి... | actress Liji in autobiography | Sakshi
Sakshi News home page

ఆత్మకథ రాస్తున్న నటి...

Published Mon, May 25 2015 8:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

ఆత్మకథ రాస్తున్న నటి... - Sakshi

ఆత్మకథ రాస్తున్న నటి...

విశ్వనాయకుడు కమలహాసన్ లాంటి వారు జీవిత కథ రాసుకోవడానికి ఇష్టపడనంటారు. అలాంటిది నటి లిజీ లాంటి కొందరు ఆటోగ్రఫీ రాసుకుని సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతుంటారు. నటి లిజి జీవితం పలు సంచలనాలమయం అని చెప్పవచ్చు. తమిళం, మలయాళం, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను కథానాయకిగా నటించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన లిజి ఇటీవల భర్త నుంచి విడిపోయి విడాకులు కోరుతూ కోర్టు కెక్కారు. అంతకుముందు ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసి కలకలం సృష్టించారు.
 
  ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న లిజి చాలామంది లాగే మళ్లీ నటించడానికి సిద్ధం అవుతారని చాలామంది భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆమె తన స్వీయ చరిత్రను రాసుకుంటున్నారట. దీని గురించి లిజి తెలుపుతూ తన జీవిత చరిత్రలో తన జీవితంలో కలుసుకున్న ప్రముఖ వ్యక్తులు, తానెదుర్కున్న సంఘటనలు, పొందుపరుస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తాను సందర్శించిన ప్రదేశాలు, మరువలేని సంఘటనలు, తన ఇంటర్వ్యూలో చేసుకుంటాయన్నారు. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలు ఉంటాయని చెప్పారు. తన ఈ ఆత్మకథను ఒక ప్రముఖ మలయాళ పత్రిక ప్రచురించనుందని వెల్లడించారు. అనంతరం తన జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందులో తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు లాంటి పలు సంచలన విషయాలు చోటు చేసుకుంటాయని లిజి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement