హీరోయిన్ పెళ్లి సందడి | Asin prepares for her wedding with Micromax's Rahul Sharma | Sakshi
Sakshi News home page

హీరోయిన్ పెళ్లి సందడి

Published Wed, Oct 7 2015 1:40 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

హీరోయిన్ పెళ్లి సందడి - Sakshi

హీరోయిన్ పెళ్లి సందడి

నటి అసిన్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నగలు, బట్టలు అంటూ పెళ్లి సరంజామా కొనుగోలు చేసే పనిలో ఫుల్ బీజీ అయిపోయారు నటి అసిన్. టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయికిగా విరాజిల్లిన ఈ మలయాళీ బ్యూటీ కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన గజినీ చిత్ర రీమేక్ ద్వారా బాలీవుడ్‌కు ఎగబాకారు.
 
టాలీవుడ్‌లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజలతోనూ, కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, అజిత్, విక్రమ్, జయం రవి వంటి టాప్ స్టార్స్‌తో నటించనట్లుగానే బాలీవుడ్‌లోనూ అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్,అక్షయకుమార్ వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. కోలీవుడ్, టాలీవుడ్‌లో మాదిరిగానే అక్కడా విజయాలను అందుకున్న అసిన్ ఆ మధ్య మైక్రోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అసిన్ నటించిన చివరి హిందీ చిత్రం 'ఆల్ ఈజ్ వెల్'. ఈ చిత్రం రెండు నెలల క్రితం విడుదలైంది.
 
ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన అసిన్ కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు. ఈ ప్రేమజంట పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ డిసెంబర్‌లోనే అసిన్ ఇంట పెళ్లి బాజా భజంత్రీలు మోగనున్నాయని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ఇక అసిన్ కుటుంబీకులు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారట.అసిన్ కూడా నగలు, బట్టలు ఇతర వస్తువుల కొనుగోలు కోసం లండన్ వెళ్లరట. అటునుంచి ఫ్రాన్స్, అమెరికా దేశాలు చుట్టేసి పెళ్లికి అవసరం అయిన సరంజామాను దిగుమతి చేసుకోనున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement