సూపర్‌స్టార్, ఇలయదళపతి కలిసిన వేళ
తమిళసినిమా; స్టార్ నటు లు ఈ మధ్య అభిమానులకు స్వీట్ షాక్ ఇస్తున్నా రు. ఇటీవల తన చిరకాల మిత్రుడు కమలహాసన్‌ను కలవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి అందర్నీ ఆసక్తి గురి చేశారు రజనీ కాంత్. కాగా ఇళయదళపతి విజయ్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఇరువురి అభిమానులకు ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ షూటింగ్ స్థానిక ఎంజీఆర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో జరుగుతోంది. అదే విధంగా విజయ్ నటిస్తున్న తాజా చిత్రం భైరవా చివరి రోజు షూటింగ్ అదే ఇన్‌స్టిట్యూట్‌లో జరిగింది. చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టిన తరువాత సమీపంలో షూటింగ్‌లో ఉన్న సూపర్‌స్టార్‌ను విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 10 నిమిషాల సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే రజనీకాంత్ 2.ఓ చిత్ర గెటప్‌లో ఉండడం వల్ల విజయ్ ఆయనతో ఫొటో దిగలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.