ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే.. | Why Kamal Haasan And Rajinikanth Don't Do A Lot Of Films! | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే..

Published Wed, Jun 1 2016 3:47 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే..

ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే..

కోలీవుడ్‌లో దిగ్గజాల్లాంటి నటులు విశ్వనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్. అలాంటి వీరిద్దరూ కలిసి నటిస్తే?అందులో రజనీకాంత్‌కు కమలహాసన్ విలన్‌గా మారితే? అంత కంటే సంచలనం ఇంకోటి ఉండదు.అయితే అది సాధ్యమయ్యే పనేనా?అలాంటి దుసాధ్య కార్యాన్ని సాధ్యం చేసే ధిశగా స్టార్ డెరైక్టర్ శంకర్ ఇటీవల అడుగులు వేశారు కానీ సఫలం కాలేదు.రజనీకాంత్,శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం సాధించిన రికార్ట్‌ను నేటికీ మరో చిత్రం బద్దలు కొట్టలేదు.

అలాంటి చిత్రానికి తాజాగా 2.ఓ పేరుతో సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని లైకా సంస్థ అత్యధికంగా 350 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా మొదట హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను నటింపజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు శంకర్. ఈ కాంబినేషన్ ఆల్‌మోస్ట్ రెడీ అన్నంతగా ప్రచారం మారుమోగింది. అయితే అలా జరగలేదు. ఆ తరువాత సూపర్‌స్టార్‌కు విలన్‌గా విశ్వనాయకుడిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు. కానీ కమలహాసన్ కూడా రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా మారడానికి అంగీకరించలేదు. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఆ పాత్రలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.ఓ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది.

రజనీకాంత్‌కు విలన్‌గా నటించడానికి కారణాన్ని కమలహాసన్ ఇటీవల బహిరంగపరచారు. ఈ అంశం గురించి ఆయన తెలుపుతూ రజనీ తానూ ఇంతకు ముందు చాలా చిత్రాలు కలిసి నటించామన్నారు. ఆ తరువాత విడివిడిగా హీరోలుగా నటిస్తున్నామని అన్నారు. ఒకవేళ మళ్లీ తాము కలిసి నటించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే ఆ చిత్రాన్ని తామిద్దరం కలిసి నిర్మించాలని, లేదా తమలో ఎవరైనా ఒకరు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతే కానీ రజనీకి తాను విలన్‌గా నటించడానికి నిరాకరించాననడంలో వాస్తవం లేదన్నారు. అలా చూస్తే తాను చాలా చిత్రాల్లో విలన్‌గా నటించానని అన్నారు. అయితే ఇప్పుడు 2.ఓ చిత్రంలో పేద్ద నటుడే రజనీకి విలన్‌గా నటిస్తున్నారని కమలహాసన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement