సిగప్పు రోజాగళ్-2 లో శ్రీదేవి? | sridevi key role in Sigappu Rojakkal 2 movie | Sakshi
Sakshi News home page

సిగప్పు రోజాగళ్-2 లో శ్రీదేవి?

Published Wed, Mar 25 2015 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

సిగప్పు రోజాగళ్-2 లో శ్రీదేవి?

సిగప్పు రోజాగళ్-2 లో శ్రీదేవి?

సిగప్పు రోజాగళ్ సీక్వెల్‌లో అతిలోక సుందరి నటించనున్నారు. 1970-80  దశకంలో సంచలన చిత్రం సిగప్పు రోజాగళ్. నేటి ప్రఖ్యాత నటుడు కమలహాసన్‌ను ప్రతి నాయకుడిగా చూపించిన ఘనత దర్శకుడు భారతీరాజాది. అందులో నాయకి పాత్రను అతిలోకసుందరి శ్రీదేవి పోషించారు. 1978లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్నిప్పుడు రీమేక్ చేయడానికి సిద్ధం అయ్యారు భారతీరాజా తనయుడ మనోజ్ భారతీరాజా. ఇందులో కమలహాసన్ పాత్రకు సీక్వెల్‌గా హాలీవుడ్ నటుడు విశాకన్‌ను ఇప్పటికే ఎంపిక చేశారు.
 
  జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సీక్వెల్‌లో  శ్రీదేవి కీలక పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇ చ్చారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత కోలీవుడ్‌కు పులి చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్న ఈ అతిలోక సుందరి భారతీరాజా దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ చిత్రం 16 వయదినిల్ చిత్రంలో మయిలు పాత్రలో జీవించారు. అప్పటి నుంచి భారతీరాజా అంటే ఆమెకు ప్రత్యేక అభిమానం. తాజా చిత్రం సిగప్పు రోజాగళ్ -2లో ముఖ్యపాత్రలో నటించడానికి   భారతీరాజా, శ్రీదే వి మధ్య చర్చలు జరిగినట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా ధృవపరచలేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement