నాకు బిరియాని స్పెషల్
నాకు బిరియాని స్పెషల్
Published Fri, Dec 6 2013 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
బిరియాని చిత్రం తనకు స్పెషల్ అంటున్నారు ఆ చిత్ర హీరో కార్తీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈయన నటించిన చిత్రం బిరియాని. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్రాజ్ నిర్మించిన ఈ భారీ చిత్రంలో హన్సిక హీరోరుున్గా, ప్రత్యేక పాత్రల్లో బాలీవుడ్ నటి మాండి టక్కర్ నటించిన ఈ చిత్రంలో రాంకీ, ప్రేమ్జీ, నాజర్, జయప్రకాష్, మధుమిత, నిత్యసత్య, ఉమ రియాజ్ఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతా న్ని అందించారు. ఈయనకిది వందో చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 20న తెరపైకి రానుంది.
బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్తీ మాట్లాడుతూ బిరియాని చిత్రం తన కెరీర్లో ప్రత్యేక చిత్రంగా గుర్తుండిపోతోందన్నారు. ఇది చెన్నై నగరానికి చెందిన కుర్రాళ్ల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం అని చెప్పారు. ఇది దర్శకుడు వెంకట్ప్రభు స్టైల్లో సాగే ఎంటర్టైనర్ అని పేర్కొన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం చిత్రానికి అదనపు బలంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెంకట్ ప్రభు, కాంకీ, ప్రేమ్జి, మోడీ టక్కర్, యువన్ శంకర్రాజా, నిర్మాతలలో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు పాల్గొన్నారు.
Advertisement
Advertisement